వరంగల్

లంబాడీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ, డిసెంబర్ 16: లంబాడీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు డా. లక్ష్మినారాయణ నాయక్, గౌరవ అధ్యక్షులు మూడు లక్ష్మణ్‌నాయక్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లంబాడీలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఐక్య వేధిక ఆధ్వర్యంలో శనివారం జనగామలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న జూనియర్ కళాశాలలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి నెహ్రూపార్క్ మీదుగా గెస్ట్‌హౌస్‌వరకు వందలాదిమందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ లంబాడీ, కోయ, గోండు ప్రజల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతుందని ఆరోపించారు. గిరిజనులకు అమలు చేస్తానని ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన, లంబాడీ జనాభ ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. లంబాడీలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీఠ్యానాయక్, స్వామి నాయక్, కిరణ్‌నాయక్, బిక్కునాయక్, దసృనాయక్, సంపత్, సోమనాయక్ పాల్గొన్నారు.
జఫర్‌గడ్‌లో...
లంబాడీలపై కోయ,గోండు వర్గానికి చెందిన వారు దాడులు చేయడం అనైతికమని లంబాడీల ఐక్య వేధిక రాష్ట్ర కార్యదర్శి బానోతు వసంత్‌నాయక్ అన్నారు. శనివారం జఫర్‌గడ్ మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ కులం నుండి తీసివేయాలనే బాబురావు, అస్రంలు టుడుం దెబ్బనాయకులు గూండాల్లాగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని అన్నారు. అంతే కాకుండా వీరికి తోడుగా కాంగ్రెస్‌పార్టీ, మావోయిస్టు పార్టీలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి లంబాడీలపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోయ, గోండు దాడులు మానుకోవాలని లేని యెడల లంబాడీలు తిరగబడితే రాష్ట్రం వదిలి పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో లంబాడీ సంఘం నాయకులు రాజేష్‌నాయక్, స్వామినాయక్, సునిల్, రవి, కిషన్, శంకర్‌లు పాల్గొన్నారు.
నర్మెటలో...
లంబాడీలకు రక్షణ కల్పించాలంటూ శనివారం ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలో లంబాడ ఐక్యవేదిక విద్యార్థి సంఘం, ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కృష్ణానాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో లంబాడీ గిరిజనులపై కోయ, గోండు సామాజిక వర్గాలవారు భౌతిక దాడులకు దిగుతూ పరోక్షంగా ముగ్గురి మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని లంబాడీ గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టి ప్రభుత్వం గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడ ఐక్య వేదిక నాయకులు జయరాంనాయక్, మోహన్‌నాయక్, హరిసింగ్‌నాయక్, రాజునాయక్, గురునాయక్, కొర్ర రమేష్‌నాయక్, రవినాయక్, కాలురాంనాయక్, లక్ష్మినాయక్, రామకృష్ణనాయక్, తిరుపతినాయక్, వినోద్‌నాయక్ పాల్గొన్నారు