వరంగల్

భగ్గుమన్న ఆదివాసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 16: కుమ్రం భీం విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని పలుప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్‌స్టేషన్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కుమ్రంభీం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సుమారు 200 మోటర్ సైకిళ్లతో వెంకటాపురం నుండి ఎదిర వరకు అక్కడి నుంచి పూసూరు గోదావరి వంతెన వరకు ఆదివాసీ నాయకులు 50 కిలోమీటర్లపైగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితనుండి తొలగించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తుడందెబ్బ, ఏబీఎస్‌బీ, బీఎస్‌పీ ప్రతినిధులు, ఉద్యమ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
మంగపేట: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో కొమరం భీం విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా ఆదివాసి హక్కుల పోరాట సమితి ఇచ్చిన ఏజెన్సీ విద్యాసంస్థల బంద్ పిలుపుమేరకు మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. తుడుందెబ్బ మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని అకినేపల్లి మల్లారం నుండి కమలాపురం వరకూ ర్యాలీ నిర్వహించి విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్బంగా తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లెబోయిన లక్ష్మణరావు మాట్లాడుతూ కొమరం భీం విగ్రహానికి చెప్పుల దండలు వేసిన లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
మేడారం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ మరియు డైరెక్టర్లగా ఆదివాసీలనే నియమించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాలకు చెందిన విద్యార్ధి సంఘం నాయకులను, తుడుందెబ్బ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ చేసిన ఆదివాసీ సంఘాల, అనుబంధ సంఘాల, విద్యార్ధి సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడందెబ్బ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొండా నాగరాజు, మంగపేట మండల అధ్యక్ష, కార్యదర్శులు అల్లెం నర్సింహరావు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు చింత కృష్ణమూర్తి, మద్దెల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.