వరంగల్

బీసీ రిజర్వేషన్లు వర్గీకరించి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 1: రాష్ట్రంలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎంబీసీల సంక్షేమంకోసం వేయికోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పటివరకు హామీని అమలులోకి తీసుకురాలేదని విమర్శించారు. సోమవారం జిల్లా సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ వరంగల్ మహానగర అభివృద్ధికి స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్ తదితర పథకాలను కేంద్రం ప్రకటించి నిధులు విడుదల చేస్తున్నా, ఈ పథకాల అమలులో అటు రాష్ట్రప్రభుత్వం, ఇటు నగరపాలక సంస్థ ఆమడదూరంలో ఉండిపోయాయని అన్నారు. వరంగల్ మహానగర పరిధిలో సుమారు రెండువందల మురికివాడలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన నిధులతో వీటిని అభివృద్ధి చేయటంలో నగరపాలక సంస్థ పాలకవర్గం విఫలమయిందని చెప్పారు. నగరంలో ఇప్పటికే ఉన్న పార్కులు అన్యాక్రాంతం అవుతున్నా నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. రెండురోజులపాటు వరంగల్‌లో జరిగిన సీపీఎం జిల్లా మహాసభలలో ముస్లిం మైనారిటీలకు 12శాతం, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు తీర్మాణం చేసామని తెలిపారు.
ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆదివాసీలు, లంబాడీల మద్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కార్మికులు, రైతులు, మహిళల సమస్యలపై, అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, కనీస వేతనాల అమలు చట్టాల అమలుకోసం సీపీఎం పోరాటాలు చేయాలని మహాసభ నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజన డెమోక్రటిక్ లెఫ్ట్ ఫ్రంట్ (బిడిఎల్‌ఎఫ్) అవతరింనుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉప్పలయ్య, రాగుల రమేష్, జిల్లాకమిటీ సభ్యుడు వీరన్న, వెంకట్, ఆరూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..
* నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి, జనవరి 1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ప్రజల నిర్వహించిన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలం రుద్రగుడెం గ్రామానికి చెందిన వందమంది టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దొంతి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా, వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు, ప్రజాసంఘాలు అనేక ఉద్యమాలు చేయగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియగాంధీ ఆనాడు కేంద్ర, రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను ఒక్కతాటిపై తెచ్చి తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తామే తెచ్చామని పౌరసరపరాల సంస్థ చైర్మన్ పల్లెప్రగతి యాత్రలో చెప్పుకోవడం చోద్య మన్నారు. అధికార పార్టీలో ఉంటూ పల్లెల్లో సమస్యలు పరిష్కరించవలసిన నాయకుడు పల్లెల్లో నిద్రచేయడం ఏమిటని మాధవరెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవటానికే యాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, యూత్ మండల అద్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.