వరంగల్

లంబాడీలు ఎస్టీలు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, జనవరి 1: లంబాడాలు ఎస్టీలు కారని, రాజ్యాంగ పరంగా తమవద్ద ఆధారాలు ఉన్నాయని తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో ఛైర్మన్ పొడెం బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్దబోయిన లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 41ఏళ్లుగా రిజర్వేషన్ పేరుతో జరుగుతున్న అన్యాయాలను సహించలేక ఉద్యమం చేపడితే తెలంగాణ ప్రభుత్వం నక్సలైట్ల పేరుతో ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. లంబాడాలు ఎస్టీలు అనేందుకు రాష్టప్రతి ఆమోదముద్ర లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మాణం లేదని, వీటన్నింటిని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. 1971లో షెడ్యూల్ ట్రైబుగా గుర్తించబడ్డామని సీతారాం నాయక్, 1976లో ఎస్టీలో చేర్చబడ్డామని రవీంద్రనాయక్, డీ-నోటిఫైడ్ ట్రైబుగా గుర్తించారని రెడ్యానాయక్, 149జిఒ ప్రకారం ఎస్టీ జాబితాలో కలిపారని లంబాడా ప్రజాసంఘాల నాయకులు ఒకరికొకరు పొంతనలేని మాటలు చెబుతున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్, గిరిజన సంక్షేమశాఖ వీరిని ఎస్టీలుగా గుర్తించి నివేదికలు పంపలేదని, అటువంటి పరిస్థితుల్లో ఏజన్సీ ప్రాంతాల తహసీల్ధారులు వీరికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఎలా మంజూరు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ తెగలకు కులధృవీకరణ ఇవ్వాలంటే ఆర్డీఓ గుర్తించాలని, లంబాడాలను ఎస్టీలలో కలిపినట్లు ఎలాంటి సవరణ లేకుండా కుల ధృవీకరణ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మహారాష్టల్రో బిసి అని, ఇక్కడ ఎస్టీ కాదని లంబాడీలు కోర్టు తీర్పు తెచ్చారని చెప్పారు. లంబాడాలు వలసవాదులు కాదన్నప్పుడు సుమన్‌రాథోడ్‌కు వలస ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్టవ్య్రాప్తంగా 20లక్షలకుపైగా లంబాడాలు వలసవచ్చి ఆదివాసీల విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడా సమాజంపై తమ పోరాటం కాదని, లంబాడాలు ఎస్టీలు కాదనేదే మా పోరాటమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ, ఏటీఎఫ్, ఏఎస్‌యు సంఘ నాయకులు పులిసె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం
మంగపేట, జనవరి 1: రైతు సంక్షేమం టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంగపేట జడ్పీటీసీ శిద్ధంశెట్టి వైకుంఠం, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఏటూరునాగారం డివిజన్ ఛైర్మన్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రప్రభుత్వం సోమవారం నుండి వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల విద్యుత్ సరఫరా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్ నాయకులు మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్‌లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందులాల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా శిద్దంశెట్టి, పగిడిపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే వ్యవసాయ పంపుసెట్లకు 24గంటలు నిరంతరంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, రైతులు పండించే పంటలకు పెట్టుబడి కోసం ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున రెండుపంటలకు కలిపి ఎనిమిది వేలు ఆర్థిక సహాయం అందించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మంగపేట గ్రామకమిటీ అధ్యక్షులు కొప్పాక హన్మంతరావు, నాయకులు బోడ రమణయ్య, ఇంతియాజ్ , పి.మోహన్, మూగల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో
ప్రథమస్థానంలో నిలుపుతా..
* కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎర్రబెల్లి
పాలకుర్తి, జనవరి 1: పాలకుర్తి నియెజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షమ రంగాల్లో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి ధయాకర్‌రావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని రాజీవ్‌చౌరస్తాలో రైతులకు 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా అదింస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యలయంలో నూతన సంవత్సర వేడుకల్లో కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియెజకవర్గలో రూ. 500కోట్లతో 2వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అదేవిదంగా ఉప్పగల్లు, చెన్నూర్, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తిచేసి అన్ని గ్రామాల్లోని చెరువులు 365నింపుతామనీ పేర్కొన్నారు. తెలంగాణ వస్తే కరెంటు రాదనీ ఆంధ్రపాలకులు దుష్ప్రచారం చేశారని, కేసీఆర్ దృఢసంకల్పంతో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి వారికి తగిన బుద్ధి చేప్పాడం హర్షణీయమన్నారు.
గ్రామాల్లో పార్టీకి సేవచేసే నాయకులను గుర్తించి వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోంటానని తెలిపారు. నూతన సంవత్సరం ప్రజలకు అభివృద్ధినామ సంవత్సరంగా ఉండలని ఆకాంక్షించారు. నాయకులు గ్రూపులకు తావునివ్వకుండా కలసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు.
*ఎమ్మెల్యేకు పలువురు శుభాకాంక్షలు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలువురు పత్రిక విలేకర్లు, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు, నాయకులు పుష్పగుచ్చలతో ఎమ్మెల్యే ఎర్రబెల్లి ధయాకర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు నల్ల నాగిరెడ్డి, సర్పంచ్‌లు అంజమ్మ, పుల్లయ్య, యాకయ్య, ఎపీటీసీలు విజయ నాగన్న, వెంకన్నలు పాల్గొన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా
నక్కలగుట్ట, జనవరి 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరా కార్యక్రమాన్ని ఉద్యోగులు అంతా కలిసి విజయవంతం చేయాలని సిఎండి గోపాల్‌రావు అన్నారు. సోమవారం విద్యుత్తు భవన్‌లో ఉద్యోగ సంఘాల నాయకులు సిఎండి కలిసి పుష్ఫగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గోపాల్‌రావు మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా కార్యక్రమం ప్రభుత్వానికే కాక, విద్యుత్తు సంస్థకు కూడా ప్రతిష్టాత్మకమైనదేనని అన్నారు.

2019 వరకూ అప్పుల తెలంగాణే
నక్కలగుట్ట, జనవరి 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని, కాని చేతలలో అది కనిపించడంలేదని, 2019వరకు రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారడం ఖాయమని ఎంసిపి ఐ రాష్ట్ర కార్యదర్శుల వర్గ సభ్యులు ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఎంసిపిఐ అర్బన్ జిల్లా కమిటీ సమావేశం రాజలింగం అధ్యక్షతన వరంగల్‌లోని ఓంకార్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి, శాసన సభాపతి రాష్ట్రంలో పిరాయింపులను ప్రోత్సహిస్తూ బలమైన ప్రతిపక్షం లేకుండా చేయాలని, దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడున్నర సంవత్సరాలలో ప్రభుత్వ నిజస్వరూపం ప్రజలకు అర్థమైనదని అన్నారు. తగిన సమయంలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత యువజన, విద్యార్థి, రైతులెవ్వరి సంక్షేమం దిశగా ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. 31 సంఘాలతో బహుజన వామపక్ష ప్రజాస్వామిక ఐక్య సంఘటన ఆవిర్భావం జరిగిందని, దీనిని ప్రజలు ఆదరించాలని కోరారు. అర్బన్ జిల్లా కార్యదర్శి మాలి బాబూరావు మాట్లాడుతూ పార్టీలో నూతన సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేయాలిని, శాఖల వారిగా బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నర్సా ప్రతాప్, మల్లిఖార్జున్ పాల్గొన్నారు.

ప్రముఖ వైద్యుడు విశ్వనాథ్‌రావు కన్నుమూత
వరంగల్(కల్చరల్), జనవరి 1: వరంగల్ నగరంలోని ప్రముఖ వైద్యులు, ఆధ్యాత్మిక వేత్త వొడితల విశ్వనాథరావు సోమవారం ఉదయం అమెరికాలో కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విశ్వనాథరావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అమెరికాలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. దీంతో నగరంలోని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనైయ్యారు. వారి మరణవార్తవిని వరంగల్ చుట్టు పక్క గ్రామాల ప్రజలు శోకతప్తులైనారు. ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఆయన వైద్య సేవలు అందించారు. ఆధ్యాత్మిక వేత్తగా బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ బ్రాహ్మణలోకాన్ని చైతన్య పరిచారు. వారు ఎంతో మంది బీద బ్రాహ్మణ యువకులకు విద్యాదానం చేసిన మహనీయుడు. డాక్టర్ విశ్వనాథరావు సౌమ్యుడని, కాజీపేట ఒక పెద్దదిక్కును కోల్పోయిందని, కాజీపేట శే్వతార్క గణపతి ఆలయానికి వారి ఆత్మీయతానురాగాలు వెలకట్టలేనివని విధ్వత్ సభ ఉపాధ్యకులు ఐనవోలు అనంతమల్లయ్య సిద్దాంతి స్మరించుకున్నారు.