వరంగల్

మేడారం భక్తులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 20: మేడారం జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఎక్సైజ్‌శాఖ నిర్ణయం తీసుకోవటంతో భక్తులు ఊరట చెందుతున్నారు. ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో జాతరలో అమ్మవారికి బంగారం పేరిట నిలువెత్తు బెల్లం మొక్కులు తీర్చుకునేందుకు అవకాశం లభించటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటుసారా తయారీని నిషేధిస్తూ ఆయా ప్రాంతాల్లో నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ పనిలోపనిగా మొదట నల్లబెల్లం అమ్మకాలపై, ఆ తరువాత సాధారణ బెల్లం అమ్మకాలపై కూడా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు బెల్లం విక్రయదారులపై దాడులు నిర్వహించి కేసులు కూడా నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ నిర్ణయంతో ఇళ్లలో వంటకాలకు అవసరమైన బెల్లంకు కరువు ఏర్పడటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు. ప్రజల నుంచి ఎదురైన నిరసనల నేపథ్యంలో వరంగల్ నగరంలో హోల్‌సేల్‌గా బెల్లం విక్రయించే కొందరు వ్యాపారులకు ఆధార్ కార్డు తెచ్చిన వారికి అర కిలో బెల్లం ఇచ్చేలా నిషేధాన్ని సడలించారు. కానీ ఈ చర్య ప్రజల అవసరాలను తీర్చలేకపోయింది. దీనికితోడు ఎక్సైజ్‌శాఖ ఆంక్షల కారణంగా బహిరంగ మార్కెట్‌లో బెల్లం ధర రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతరలో మొక్కుల కింద చెల్లించే బెల్లం ఎలా కొనుగోలు చేయాలని గత కొన్నిరోజులుగా భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తు వచ్చారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి జాతర సందర్భంగా బెల్లంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించాలని కోరుతు వచ్చారు. మరోపక్క కొందరు బెల్లం వ్యాపారులు బెల్లంపై ఉన్న ఆంక్షలను ఆసరగా తీసుకుని బెల్లం స్టాకు నిలువచేసి జాతర సమయంలో అడ్డగోలు ధరలకు అమ్ముకోవాలనే ప్రయత్నాల్లో బిజీబిజీ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మేడారం జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించటంతో సామాన్య జనాలు హమ్మయ్య అనుకుంటున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు ఇక బెల్లం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. ఆంక్షల సడలింపుల నేపథ్యంలో బెల్లం అక్రమ నిలువలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.