వరంగల్

‘బంగారం’ దొరికిందోచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జనవరి 20: సమ్మక్క - సారలమ్మ జాతరలో భక్తులు ప్రధానంగా చెల్లించుకునే నిలువెత్తు ఎత్తు బంగారం (బెల్లం) సమస్య తొలగిపోయింది. కేసముద్రం మండల కేంద్రంలో భక్తులు మొక్కు తీర్చుకోవడానికి అనుకూలంగా తెల్లబెల్లం షాపును ప్రభుత్వం కేటాయించింది. మండల కేంద్రంలోని అంగడి సెంటర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాపులో శనివారం బెల్లం అమ్మకాలు ప్రారంభించారు. ఎత్తు బెల్లం కావాల్సిన వారు ఆధార్‌కార్డుతో వచ్చి తులాభారం వేసుకొని కిలోకు 45 రూపాయల చొప్పున బెల్లం తీసుకోవచ్చని షాపు నిర్వాహకుడు బోనగిరి శ్రీ్ధర్ తెలిపారు. నిన్న మొన్నటి వరకు మేడారం జాతరలో మొక్కులు తీర్చుకోవడానికి బెల్లం లభించక నానా ఇబ్బంది పడటంతో పాటు కిలోకు 90 రూపాయలకు ఖరీదు చేయడంతో పాటు కొంత మంది అంత ధర పెట్టలేక సగం బెల్లం, సగం చెక్కర తీసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపధ్యంలో మండల కేంద్రంలో బెల్లం షాపు ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
మృత్యుంజయ హోమం
శుభపరిణామమే: ఎంపీ రాపోలు

పరకాల, జనవరి 20: లోక కల్యాణార్థమై సకల జనుల కోసం మృత్యుంజయ హోమం నిర్వహించడం శుభ పరిణామమని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. శనివారం భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని స్థానిక పద్మశాలి భవనంలో పరకాల పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి ఆనంద్‌భాస్కర్ భక్త మార్కండేయ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన, పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పద్మశాలి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ లోకంలో మృత్యుంజయుడైన వారు ఎవరూ లేరని చెప్పారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సకల జనుల కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్న పద్మశాలి సంఘాన్ని, నిర్వాహకులను ఆయన అభినందించారు. మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గండు ప్రభాకర్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు చెన్నమల్ల ఉప్పలయ్య, చిదురాల దేవేందర్, వడ్నాల నరేందర్, వెంకటేశ్వర్లు, అంకం వెంకటేశ్వర్లు, రాజగోవిందు, సామంతుల సదానందం తదితరులు పాల్గొన్నారు. పరకాల శ్రీనివాసకాలనీలోని శ్రీనివాస చేనేత సహకార సంఘ భవనంలో శనివారం భక్త మార్కండేయ మహర్షి జయంతితో పాటు నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, లోక కల్యాణార్థం కార్మికుల శ్రేయస్సు కొరకు నిర్వహించినట్లు సంఘం అధ్యక్షులు మంత్రి రాజేందర్, కార్యదర్శి మార్త బిక్షపతి, పద్మశాలి సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొడూరి మల్లేశంలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వీవర్స్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేశ్, అంకం వెంకటేశ్వర్లు, జడ్పిటీసి పాడి కల్పనాదేవి, ఎంపిపి నేతాని సులోచన, చైర్మన్ రాజభద్రయ్య పాల్గొన్నారు.

టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత
* జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి పిలుపు

మహబూబాబాద్, జనవరి 20: జిల్లాలో విద్యావిధానంలో మార్పుతీసుక వచ్చి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100శాతం రాష్ట్రంలో జిల్లాను ఉన్నత స్థానంలో ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి అన్నారు. మార్చిలో జరుగబోయు 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని శనివారం జిల్లాలోని 146 మంది ఉధ్యాయులతో స్థానిక అనంతారం మోడల్‌స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ దామోదర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. అత్యుత్తమ ఫలితాలతోపాటు నాణ్యమైన విద్యను బోధించాలని.. ఒక ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థుల్లో ప్రేరణ తీసుకరాగలడన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు అందిస్తుంటే విద్యావిధానం జిల్లాలో ఎందుకు వెనుకబడుతుందన్నారు. సమాజానికి ఉపాద్యాయుడు జీవనాడి అని విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ట్రైబల్ జిల్లాగా నూతనంగా ఏర్పడిందని కొంతభారం తప్పదని విద్యార్థులకు పరీక్షలు 53రోజులే తక్కువ కాలం ఉందని ప్రణాళికబద్ధంగా లక్ష్యాలను రూపొందించాలని అన్నారు. జిల్లాలోని ఉత్తీర్ణతశాతం పెంచేక్రమంలో ఆరోగ్యమిత్ర, స్వచ్ఛందసంస్థ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ రూపొందించిన కరపత్రాలను జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యప్రియ, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు.

దేశం చూపు.. తెలంగాణ వైపు..
పరకాల నగర పంచాయతీకి రూ.15 కోట్లు మంజూరు * పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, జనవరి 20: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ షాక్‌తో రెండు నెలల క్రితం మరణించిన రమేష్, సుధాకర్ కుటుంబ సభ్యులకు రూ. 4లక్షల చొప్పున ఆర్థిక సహయ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తుందని చెప్పారు. పరకాల నగర పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకుగాను జిఓ నెంబర్ 32 ద్వారా రూ. 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. స్వార్థ రాజకీయాలు పక్కన బెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షాలు వణికిపోతున్నాయన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెరాస ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, పరకాల నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, పాడి ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు మడికొండ సంపత్‌కుమార్, అల్లె దశరథం, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

రూ. 16 లక్షల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

* నలుగురు నిందితుల అరెస్టు

వరంగల్, జనవరి 20: వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలో అక్రమంగా నిలువచేసిన 16లక్షల రూపాయల విలువచేసే నిషేధిత గుట్కా పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. శనివారం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పిన్నావారివీధికి చెందిన బెజ్జం గోపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో కర్ణాటక నుంచి పెద్దమొత్తంలో గుట్కాప్యాకెట్లు కొనుగోలు చేసి వివిధ మార్గాల్లో ఇక్కడకు తెప్పించి నగరంలోని బొందివాగు ప్రాంతంలో ఉన్న తన గోదాములో నిలువ చేసేవాడు. ఈ గుట్కాప్యాకెట్లను తనవద్ద పనిచేసే కూర కుమారస్వామి సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన టాస్క్ఫోర్స్ విభాగానికి నిషేదిత గుట్టా అక్రమ అమ్మకాలపై సమాచారం అందటంతో నిఘా పెట్టి శుక్రవారం పిన్నావారి వీధిలో ఆటోలో గుట్కాస్టాకుతో రవాణాకు సిద్ధంగా ఉన్న కుమారస్వామిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమారస్వామిని పోలీసులు విచారించగా లభించిన సమాచారంతో గిర్మాజీపేట ప్రాంతంలో ప్రభుత్వం నిషేదించిన గుట్కాప్యాకెట్లను అక్రమంగా విక్రయిస్తున్న దేవా రాకేష్, గుండా సతీష్‌లకు చెందిన గోదాములపై దాడులు నిర్వహించి అక్కడ నిలువచేసిన 11లక్షల రూపాయల విలువచేసే గుట్కాస్టాకును స్వాధీనం చేసుకున్నామని, అదే విధంగా గుట్టాను అక్రమ మార్గాలలో తెప్పిస్తున్న బెజ్జం గోపి, ఆయనకు సహకరిస్తున్న కుమారస్వామి నుంచి ఐదులక్షల రూపాయల విలువచేసే గుట్టాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. గుట్కా అక్రమ అమ్మకాలపై నగరంలోని మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసామని చెప్పారు. గుట్కా స్టాకును పట్టుకున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి రివార్డు అందచేస్తామని కమిషనర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ అదనపు డీసీపీ అశోక్‌కుమార్, టాస్క్ఫోర్స్ ఏసీపీ వెంకటరమణారెడ్డి, ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

*మరో 20 ఏళ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం * పల్లె ప్రగతిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి

నల్లబెల్లి, జనవరి 20: రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులను పునరుద్దరించి పంటలకు సాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం ఏజెండాగా పని చేస్తున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో శరవేగంగా దూసుకపోతున్నదని చెప్పారు. మరో ఇరవై ఏళ్లు టీఆర్‌ఎస్‌దే అధికారమని ఆయన స్పష్టం చేశారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆశ్రవెల్లి, గొల్లపల్లి, కొండాయిల్‌పల్లి, నల్లబెల్లి గ్రామాల్లో పెద్ది పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి సభలలో పెద్ది మాట్లాడారు. కాకతీయుల కాలం నాటి చెరువులలో పూడిక పేరుకపోయిందని, కట్టలు, తూములు శిథిలావస్ధకు చేరుకోవడంతో పొలాలకు సరిగా నీరు అందని పరిస్థితిని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీ ఆర్ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మిషన్ కాకతీయ వల్ల గత మూడేళ్లలో పంటలకు సమృద్దిగా పండాయని అన్నారు. నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువును రిజర్వాయర్‌గా మలిచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు చెప్పారు. రబ్బరింగ్ సిస్టమ్ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 32 రకాల సంక్షేమ పథకాలకు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రధాన మంత్రితో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ప్రశంసిస్తున్నారని చెప్పారు. అర్హులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పల్లె ప్రగతిలో తాను మంజూరు చేసిన పనులను ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు వివరించారు. కాగా ఆయా గ్రామాలకు చెందిన మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఎదురేగి పెద్దికి ఘనస్వాగతం పలికారు.

అల్పసంఖ్యాక ప్రజలు
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
*మైనారిటీ శాసనసభా కమిటీ చైర్మన్ షకీల్ అమీర్ హితవు

వరంగల్, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం అల్ఫసంఖ్యాక వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని తెలంగాణ మైనార్టీ శాసన సభా కమిటీ చైర్మన్ మహ్మద్ షకిల్ ఆమిర్ అన్నారు. శనివారం వరంగల్ నగర పర్యటనకు వచ్చిన శాసన సభా కమిటీ సభ్యులు నగరంలోని వక్ఫ్ ఆస్తులను, మైనారిటీ సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను పరిశీలించారు. అనంతరం అర్బన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో అల్ఫసంఖ్యాక వర్గాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మహ్మద్ షకిల్ ఆమిర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అల్ఫసంఖ్యాక వర్గాల వారి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి ఉచితంగా విద్యను అందిస్తుందని, ఆడపిల్లల కోసం షాదీముబారక్ పేరిట 75వేల 116 రూపాయలను అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 77వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉండాల్సి ఉండగా అందులో 35వేల ఎకరాలు ఖాళీగా ఉన్నయని వాటిని ఫెన్సింగ్ వేసి సంరక్షించుకోవాలని అన్నారు. జిల్లాలో ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడంలో జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అల్ఫసంఖ్యాక వర్గాల కోసం వారి పండగలకు ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు, దుస్తుల పంపిణీ చేస్తుందని, విద్యార్థిని విద్యార్థులకు పోస్ట్, ఫ్రీమెట్రిక్ స్కాలర్‌షిప్స్‌ను, ఉపాధి కల్పనకు శిక్షణ అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమీషనర్ సుధీర్‌బాబు, మున్సిపల్ కమీషనర్ శృతి ఓఝా, జాయింట్ కలెక్టర్ దయానంద్, జిల్లా అల్ఫసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి రత్నవీరచారి తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్ పల్లెనిద్ర
* పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం * ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ
రేగొండ, జనవరి 20: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం రాత్రి రేగొండ మండలం కకర్లపల్లి గ్రామంలో స్పీకర్ ప్రగతి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో ఉరేగింపుగా ప్రతి ఇంటింటికి తిరిగి అభివృద్ధి పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన నూకల రమేష్ ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో వేలకోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. రైతులకు రుణమాఫీ, 24గంటల ఉచిత కరెంట్ సరఫరా, విత్తనాలు, ఎరువులకు సబ్సిడీ ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పెన్ష్‌న్లు ఇచ్చి ప్రభుత్వం ఆసరా కల్పిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ను తలపించే విధంగా వేలకోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తూ నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కాకర్లపల్లి గ్రామానికి వారం రోజులలో 30లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.