వరంగల్

ఇద్దరు జేసీలకు ఐఏఎస్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 22: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఇద్దరు జాయింట్ కలెక్టర్లకు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల పునర్విభజన సందర్భంగా రాష్ట్రంలో అవసరాల మేరకు ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేని కారణంగా అప్పటి వరకు జాయింట్ కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారులు పనిచేస్తుండగా కొత్త జిల్లాలకు సీనియర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించారు. వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా హరిత, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించగా వీరు గడచిన 14నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. హరిత గతంలో జనగామ ఆర్డీఓగా పనిచేయగా, అమయ్‌కుమార్ ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసారు. రాష్ట్రంలోని సీనియర్ స్టేట్ సర్వీస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా అందులో కొందరికి ఐఏఎస్‌లుగా ప్రమోట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ తాజా నిర్ణయంతో వరంగల్ రూరల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న హరితకు, భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్‌కు ఐఏఎస్ హోదా దక్కింది.