వరంగల్

ప్రభుత్వ సాయం అందడం లేదని.. ట్యాంక్ ఎక్కి బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 16: మరిపెడ మండలంలోని మాకుల తండాకు చెందిన బొడ రవి అనే యువకుడు శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలోని వాటర్‌ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం సృష్టించింది. కుమారుడితో సహా వాటర్ ట్యాంకు ఎక్కిన రవి... ఈ ప్రభుత్వం తనను ఆదుకోవడం లేదని అందుకే చనిపోవాలను కుంటున్నానని అంటూ పెద్దపెట్టున అరుపులు, కేకలు వేయడం సమీపులకు ఫొన్‌ద్వారా సమాచారం అందించడంతో ఒక్కసారిగా మానుకోటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవి గతంలో ఎంపీటీసీగా పోటీచేసి ఓడిపోయాడు. ఆ సమయంలో ఉన్న ఆస్తిని అమ్ముకున్నాడు. దీంతో విధిలేక గుడుంబా అమ్ముకొని జీవిస్తున్నాడు. గతంలో అనేకసార్లు ఎస్టీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తుచేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లాకు చెందిన పోలీసులు రవి భార్యను గుడుంబా కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన రవి మానుకోట కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏంచేయాలో పాలుపొని పరిస్థితిలో కలెక్టరేట్ సమీపంలోని వాటర్‌ట్యాంక్ పైకెక్కి ఇక తాను బతికి వ్యర్థం అని.. ఆత్మహత్య చేసుకుంటానంటూ సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అనేక మంది గిరిజన సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సమాచారాన్ని జేసీ దామోదర్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్‌లకు అందజేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన దామోదర్‌రెడ్డి ఫోన్ ద్వారా వాటర్‌ట్యాంక్ పైనున్న రవితో మాట్లాడారు. అఘాయత్యం చేసుకోవద్దని.. సమస్యను పరిష్కరించేందుకు తమవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గుడుంబా కేసులో అరెస్ట్ అయిన అతడి భార్యను విడిపించారు. ఆమెతో కూడా ఫొన్‌ద్వారా రవితో మాట్లాడించారు. అప్పటికే పెద్దసంఖ్యలో జనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ దామోదర్‌రెడ్డి చొరవతో దిగివచ్చిన రవిని రూరల్ సీఐ తిరుపతి వాటర్‌ట్యాంక్ పైకెక్కి కిందకు తీసుకొచ్చాడు. దీంతో మానుకోటలో కొన్ని గంటలపాటు ఉత్కంఠం సృష్టించిన యువకుని ఆత్మహత్యాయత్నం ఘటన సుఖాంతమైంది. పలువురు గిరిజన సంఘాల నాయుకులు ఈ ప్రాంతానికి చేరుకొని మానసికంగా, ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందిలో ఉన్న రవికుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం సాయం చేసి కుటుంబం నిలబడేందుకు సహకరించాలని జేసీని కోరారు.