వరంగల్

సెలవుల్లో ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఏప్రిల్ 16: ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సెలవు దినాలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ప్రజలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. సోమవారం ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధ్వర్యంలో వరంగల్ 2 డిపోనుండి కాకతీయ దర్శిని పేరిట ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక టూర్ ప్యాకేజీ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ వారు ఉమ్మడి జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను ప్రజలకు చూపించేందుకు ప్రత్యేక వసతులతో కూడిన ప్రయాణాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వరంగల్‌లోని దేవాయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సూర్యకిరణ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రతి శని, ఆదివారాలు, సెలవుదినాలలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కాకతీయ దర్శిని పేరిట వజ్రమినీ ఎసీ బస్సు సర్వీసు ద్వారా ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌ని నడుపుతున్నామని తెలిపారు. ఈ సర్వీసు ఉదయం ఏడు గంటలకు హన్మకొండ బస్సు స్టేషన్ నుండి ప్రారంభమై రామప్ప, లక్నవరం, మేడారం, మంగపేట, మల్లూరు మొదలగు ప్రదేశాలను దర్శించుకుని రాత్రి తొమ్మిది గంటలకు హన్మకొండకు చేరుతుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఈనెల 21తేదీ నుండి ప్రారంభిస్తున్నామని, ఆసక్తిగలవారు ఆర్టీసీ ఆన్‌లైన్ ద్వారా, అధికృత ఎజెంట్ ద్వారా, బస్సుడిపోలో సంప్రదించాలని కోరారు. ఈ ప్యాకేజీ సర్వీసులో పెద్దలకు 510 రూపాయలు, పిల్లలకు 380 రూపాయలుగా నిర్ణయించామని, గ్రూప్ సభ్యుల కోరిక మేరకు దర్శనీయ స్థలాలలో మార్పు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దయానంద్, ఆర్డీఒ వెంకారెడ్డి, డిఆర్‌ఒ డేవిడ్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.