వరంగల్

మానవ మనుగడకు చెట్లే మూలాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 20: మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టే విధంగా మందస్తు ప్రణాళికలతో మొక్కలు నాటాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన హరిత హారం సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లే మూలాధారమన్న సూక్ష్మ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హరితహారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విరివిగా చేట్లునాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో ప్రభుత్వ శాఖలను అన్నింటినీ భాగస్వామ్యంతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు చెట్లు నాటడం ద్వారా జరిగే పరిణామాలను విశదీకరించి విరివిగా మొక్కలు నాటనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో జూన్, జులై మాసంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీలు ఏర్పాటుకు ఆయా శాఖాపరంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె సూచించారు. నర్సరీల ఏర్పాట్లలో కాంట్రాక్టర్లు మందుకు రాకపోతే శాఖ పరంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా పరిధిలో 10 లక్షల మొక్కలు, అటవీశాఖ ద్వారా డిఆర్‌డివో ద్వారా 10 లక్షలు, హార్టీకల్చర్, సెరీకల్చర్, అగ్రికల్చర్ ద్వారా మరో 5లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆమె తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యంగా రైతులను భాగస్వామ్యం చేసేందుకు వారికి అవసరమైన మొక్కలను అందించాలని, తహశీల్ధార్లు, ఎంపీడీవోల భాగస్వామ్యంతో మొక్కలు నాటేందుకు సులువైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వ శాఖల భూములు చెరువు శిఖాలు, బంజరు భూములు, రాక్‌లాండ్, గుర్తించి సంబంధిత శాఖలకు తెలియచేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి మొక్కలను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్సైజ్, డీఈవో, ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎక్కువ మొత్తంలో భూ లభ్యత లభించక పోతే భూ లభ్యత అనుగుణంగా మొక్కలు నాటాలని ఆమె సూచించారు. ఈ రానున్న తరానికి అడువులను అందించడానికి, హరిత హారం మొక్కల పెంపకాన్ని అందించేందుకు వాటి సంరక్షణకు పూర్తి బాధ్యతలను కూడా చేపట్టాలని వాటి రక్షణకు చుట్టూ కంచె ఏర్పాటు చేసి వాటికి తగిన నీటి సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారిణి అపర్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్. దయానంద్, డీఆర్‌డీవో రాము, అగ్రికల్చర్ ఏడీ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ అధికారి రత్నవిరాచారి, బీసీ సంక్షేమ అధికారి, పంచాయతీ రాజ్, కుడా, మున్సిపల్ శాఖ, డీపీవో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించాలి
*ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
నర్మెట, ఏప్రిల్ 20: ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో ఝాన్సీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుకాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని అన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ. 1590, సీ గ్రేడ్ రకానికి రూ. 1550 మద్దతు ధర ప్రకటించిందన్నారు. అదే విధంగా కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందచేస్తుందన్నారు. గొల్లకుర్మలకు గొర్రెల, మత్స్యకారులకు చేపపిల్లలు, రజకులకు దోతిగార్డ్, పద్మశాలీలకు మరమగ్గాలు, ఆడ పిల్లలు పుట్టిన్నట్లయితే తల్లిదండ్రులకు భారం కాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ. 1లక్ష 116లు అందించిన ఘనత కేసిఆర్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపి తాగునీరు అందిస్తున్నందున రైతులు ధాన్యాన్ని అధికంగా పండించాలన్నారు. అదే విధంగా అమ్మాపురం గ్రామంలో రైతు సమన్వయ సమితి భవనం కోసం స్థలాన్ని పరిశీలించి, సర్వే నిర్వహించి నవేదిక పంపించల్సిందిగా తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పిట్టల బాలకిష్టయ్య, ఎంపీటీసీ జొన్నగోని కిష్టయ్య, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ఎండీ గౌస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కంతి రాజలింగం, ఇర్రి గాల్‌రెడ్డి, ఐకేపీ సంఘం గ్రామ సంఘం అధ్యక్షురాలు గంగం శశిరేఖ, గోలగోని సురిక, పండ్ల లలిత, వీవోఏ బాల్‌చందర్‌లు పాల్గొన్నారు.