వరంగల్

రాష్ట్రానికి వరం.. కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 23: వందల సంవత్సరాల మన్నికతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి స్థానిక ఎమ్మెల్యే పుట్టా మధు, పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సుమారు 600 మంది మత్స్యకారులతో కలిసి జయశంకర్ జిల్లా భూపాల్‌పల్లి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన కనె్నపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, సంబంధిత ఇంజనీర్ల ద్వారా జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వంద శాతం సమర్ధవంతంగా అమలు అవుతూ అభివృద్ధికి ఒక మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం మారిందని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను సస్యశ్యామలం చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మందికి జీవనభృతిని కల్పించే కాళేశ్వరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఒక వరమని, వందల సంవత్సరాలు మన్నికతో ఉండేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వలన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చరిత్రలో నిలచి పోతారన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే 13 జిల్లాలోని 18 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరుగడంతో పాటు నూతనంగా మరో 18 లక్షల ఎకరాల పంట చేలకు నీరు మళ్లించడం ద్వారా రాష్ట్రం అంతా పచ్చదనంతో నిండుతుందని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం వలన గోదావరి నదిలో 365 రోజులు నీరు నిలువ ఉండడం వలన పర్యాటకంగా అభివృద్ధి సాధించడంతో పాటు చేపల పెంపకం ద్వారా మత్య్సకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించేందుకు మత్స్యకారులతో ఈ పర్యటన ఏర్పాటు చేశామని అన్నారు. ప్రాజెక్టు పూరె్తైన తర్వాత లారీల కొద్దీ చేపలు ఇక్కడి నుండి రవాణా చేయవచ్చని అన్నారు. ఏటా 2000 టీఎంసీల నీరు గోదావరి ద్వారా సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వలన సంవత్సరంలో 90 రోజులు పాటు ప్రతి రోజు రెండు టిఎంసీల చొప్పున మొత్తం 180 టిఎంసీల నీటిని పంపు చేసుకోవచ్చునని, ప్రాణహిత నుండి అధికంగా నీరు వస్తున్నందున మనం భవిష్యత్తులో ఎన్ని టీఎంసీల నీళ్లనైనా వాడుకునే అవకాశం ఉందని ఇంజనీర్లు మత్స్యకారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, మత్స్యశాఖ కమిషనర్ సుభద్ర, విజయడెయరీ ఎండీ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాలకుసీపీ ‘చేయూత’!
నక్కలగుట్ట, ఏప్రిల్ 23: విధి నిర్వహణలో అకస్మికంగా మరణించిన పోలీసు కుటుంబాలకు శాఖాపరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ అన్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన హెడ్‌కానిస్టేబుల్ ఐలయ్య, ఎఆర్ కానిస్టేబుల్ మహేందర్‌ల కుటుంబాలకు చేయూత పథకం ద్వారా లక్షన్నర చొప్పున రెండు కుటుంబాలకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి శాఖాపరమైన సహాయాన్ని అందించేందుకు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కుటుంబ సభ్యులు సరస్వతి, చంద్రకళ, పోలీసు అధికారులు సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.