వరంగల్

నకిలీ విత్తనాలపై ‘పిడి’కిలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 23: ప్రభుత్వం నిషేధించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ, నాణ్యతలేనివి విక్రయించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మహబూబాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ నోడల్ ఆఫీసర్, డీఎస్పీ నరేష్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని వివిధ ఫర్టిలైజర్‌షాపుల్లో స్థానిక వ్యవసాయాధికారి వాసుదేవరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతించని బీటీ -3 పత్తి విత్తనాలతో పాటు పలు నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. నిరంతరం టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు చేస్తుందని, ఈ తనిఖీల్లోగాని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు తేలినా విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా షాపుల్లో ఎరువుల స్టాక్‌ను తనిఖీ చేశారు. లైసెన్స్‌లను పరిశీలించారు.
లక్ష్మణ్ మృతిపై సమగ్ర విచారణ
కాగా, సాక్షరభారత్ ఉప్పరపల్లి గ్రామకో ఆర్డినేటర్ పందుల లక్ష్మణ్ మృతిపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. లక్ష్మణ్ నిర్వహిస్తున్న డాబా పార్ట్‌నర్‌తో తగాదాలతో లక్ష్మణ్‌ను కొట్టి చంపారని ఆదివారం రాత్రి దళిత సంఘాల నాయకులు, లక్ష్మణ్ కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఈ కేసును పరిశీలించేందుకు డీఎస్పీ కేసముద్రం వచ్చారు. ఉప్పరపల్లికి వెళ్లి మృతుని బంధువులతో మాట్లాడారు. అలాగే, లక్ష్మణ్ తీవ్రగాయాలతో పడి ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మక్కలు తీసుకువచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఎస్పీ మార్కెట్ సిబ్బందికి సూచించారు. మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలా పనిచేయడం లేదని, వాటికి తక్షణం మరమ్మతులు చేయించడంతో పాటు గేట్ల వద్ద, మెయిన్‌రోడ్డులో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఏర్పడకుండా పోలీసులు, మార్కెట్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

ప్రతి ఆంశంలోనూ పరమాత్ముడిని చూడాలి
* కొత్తకొండ వీరభద్రుని దర్శించుకున్న
శ్రీ మాధవానంద సరస్వతి
భీమదేవరపల్లి, ఏప్రిల్ 23: ప్రతి అంశంలోనూ పరమాత్ముడిని చూడాలని తొగుట్ట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి భక్తులకు పిలుపునిచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ లో సోమవారం వీరభద్రుడు, భద్రకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తుల నుద్దేశించి ప్రవచనాలు చెప్పారు. ప్రతి మనిషిలో ఆగ్రహం నశిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందన్నారు. వీరభద్రుని సేవిస్తే జీవితం సర్వం ఆనందమయమవుతుందన్నారు. దివ్యమైన సన్నిధి భద్రకాళీ, వీరభద్రుని దేవాలయం అని, ప్రపంచంలోని అనేక విషయసంపదలు, భోగభాగ్యలు అనుభవించడానికి కారణం భగవంతుని ఆరాధించినపుడే సాధ్యమవుతాయన్నారు. జీవితం మంగళప్రదంగా ఉండాలంటే తప్పకుండా వీరభద్రుని దర్శించాలన్నారు. కొత్తకొండ వీరభద్రుని ఆలయంలో వీరభద్ర సమేత భద్రకాళీ అమ్మవార్లు, ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషమన్నారు. విశిష్టమైన ఈ స్థలంలో వీరభద్రుని ధ్యానించడం జన్మధన్యమన్నారు. ఇసుకరేణువు నుండి శంకరుని చూసినట్టే, అణువు, అణువు నుండి అమ్మవార్లను చూడాలన్నారు. విగ్రహ పూజతో మనస్సు నిగ్రహంగా ఉంటుందని, మనస్సు నిగ్రహంగా ఉన్నపుడే ఆగ్రహం తొలగిపోతుందని, అప్పుడే మనిషి సచ్ఛీలుడుగా ఉంటాడని చెప్పారు. కొత్తకొండ వీరభద్రుని అలయంలో నిత్యం వేదపారాయణం జరగాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం అన్నదానం ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత సేవలందించినట్లేనని పేర్కొన్నారు. సమావేశంలో కాసం రమేశ్, ఆలయ సిబ్బంది హంసారెడ్డి, డైరెక్టర్లు రజనాచారి, రాగం రజిని, దస్తరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.