వరంగల్

ఇది చేతల ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపూర్, ఏప్రిల్ 23: తెరాస మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కమలాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గ్రామంలో 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం కోటి 30 లక్షలతో 33/ 11 కేవి విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్‌ను ఇచ్చారని, అదే తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్‌ను వ్యవసాయానికి ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మించాలంటే కనీసం 35 యేళ్లు సమయం పట్టేదని, అయితే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో యుద్ధ ప్రతిపాదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని అన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల మండలంలో ఉన్న వెంకటేశ్వర్లపల్లి గ్రామం.. కమలాపూర్ మండలంలో విలీనం అవ్వడం బాధాకరం అని, గ్రామానికి 50 లక్షల నిధులు ఇవ్వాల్సిందిగా కోరగా 25 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. అదే విధంగా పరకాల నుండి మరిపెల్లిగూడెంకు డబుల్ రోడ్ నిర్మాణం కోసం మంత్రిని అడగగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల గ్రామానికి కాకుండా ఇతర గ్రామాలకు కూడా విద్యుత్ కొరత లేకుండా ఉంటుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులు అప్పుల పాలు కావద్దని ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు పెట్టబడిగా ఇవ్వడానికి ప్రణాళికలు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం జూన్ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి తాగు, సాగు నీరు ప్రతి గ్రామానికి 365 రోజులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోంరయ్య, జడ్పీటీసీ మారెపల్లి నవీన్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్‌రావు, జడ్పీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి * ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల ఆదేశం
వరంగల్, ఏప్రిల్ 23: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో జరిగిన గ్రీవెన్ సెల్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను ఏ మేరకు పరిష్కరించారని జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రజావాణి దరఖాస్తులను త్వరతిగతిన పరిష్కరించాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ శాఖలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను, రానున్న మూడు నెలలు ప్రతి నెల టిజిఎఫ్‌ఎం వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది శాఖల వారిగా నాటనున్న హరితహరం మొక్కలు ఏప్రాంతంలో ఎన్ని మొక్కలు, ఏయే రకాల మొక్కలు నాటుతున్నారు, తదితర సమగ్ర సమాచారంతో వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని అధికారులకు తెలిపారు. ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, శాఖల వారిగా మండల స్ధాయిలో ఎటువంటి పెండింగ్ పనులు ఉన్నా ముందు రోజునే నివేదిక ఇవ్వాలని, ఆ అంశాలపై సంబంధిత మండల అధికారులతో సమీక్షిస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా స్ధాయి అధికారులు అందరు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ హరిసింగ్, డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డి, ఆర్డీవో మహేందర్‌జీ తదితరులుపాల్గొన్నారు. అదే విదంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ గ్రీవెన్ సెల్ కార్యక్రమంలో పాల్గొని ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు.