వరంగల్

పంచాయితీ ఎన్నికలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, మే 19: త్వరలో జరగబోయే పంచాయితీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకుగాను వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు సిద్ధంగా ఉండాలని కమిషనర్ డా.వి.రవీందర్ పోలీసు అధికారులకు సూచించారు. శనివారం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం జరిగింది. పోలీసు అధికారుల పనితీరుతోపాటు కేసుల నమోదు వాటి పరిష్కారం, నిందితుల అరెస్టులు తదితర విషయాలను పోలీసు కమిషనర్ సమావేశంలో పాల్గొన్న డీసీపీ, ఇన్స్‌పెక్టర్లను అడిగి తెలసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీసు స్టేషన్లకు వచ్చే సామాన్యులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పూర్తి సహాకారం అందించాలని కోరారు. ముఖ్యంగా పంచాయితీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లపై ఇప్పటినుండే కావలిసిన సమాచారాన్ని సేకరించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం, డీజీపీ ఆదేశాలను అనుసరిస్తూనే సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులు వారి వారి పరిధిలో ఉన్న గ్రామా పంచాయితీలను సందర్శించాలని కోరారు. పోలీంగ్ కేంద్రాలు, సెంటర్ల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ అధికారులు గ్రామ పోలీసులతో కలిసి ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించాలని కోరారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై ముందస్తు సమాచారం సేకరించుకుంటూ గ్రామస్థులతో సత్ససంబంధాలు కొనసాగించాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లలోని నిందితులను కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించారు.
ప్రతి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్: శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై పోలీసు కమిషనర్ ప్రస్తావిస్తూ ఇకపై పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడంతోపాటు నేరస్థులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 90శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇదే పద్దతిలో ట్రైసిటి పరిధిలో కమ్యూనిటీ, మేము సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడు బ్రేకర్లు, రేడియంతో కూడిన సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 25వ తేదీనుండి విధులు నిర్వహించేందుకు పోలీసు స్టేన్‌కు ద్విచక్ర వాహనంపై అధికారులు, సిబ్బంది హెల్మెట్ తప్పక ధరించే విధంగా సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు స్టేషన్ల పనితీరు మరింత మెరుగు పర్చేందుకుగాను పోలీసు స్టేషన్లలో నిర్వహించే విధులను 17 రకాలుగా విభజించి ఆయా విధులను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేయ డం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలమని సూచించారు. ఇకపై ప్రతినెల విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులను అందజేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీలు అశోక్‌కుమార్, మురళీధర్‌తోపాటు ఎసీపీలు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి వార్తకు స్పందన
* అక్రమ వసూళ్లకు పాల్పడ్డ విఆర్‌వోలు, విఆర్‌ఎలకు మోమోలు జారీ
నల్లబెల్లి, మే 19: పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నల్లబెల్లి మండలానికి చెందిన వీఆర్‌వో, వీఆర్‌ఎలు అక్రమాలకు పాల్పడరంటూ ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్తపై జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు నల్లబెల్లి మండలం పరిధిలో ఎనిమిది మంది వీఆర్‌వోలు, తొమ్మిది మంది వీఆర్‌ఎలకు మోమోలు జారీ చేయడం జరిగిందని నల్లబెల్లి తహాశీల్ధార్ రాజేంద్రనాథ్ తెలిపారు. ఈసందర్భంగా తహశీల్ధార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంలో పట్టాదారు పాసుపుస్తకాలు పేర వీఆర్‌వోలు, విఆర్‌ఎలు రైతుల నుండి పెద్దమొత్తంలో డబ్బుల వసూళ్లుకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ అక్రమ వసూళ్లపై ‘ఆంధ్రభూమి’ పత్రికలో వచ్చిన వార్తపై వీఆర్‌వోలను మోమోలు జారీ చేస్తూ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ జరపించడం జరుగుతుందని అన్నారు. ఎవరైన రైతులను అధికారులను డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తహశీల్ధార్ కార్యాలయంలో తెలియాజేయాలని కోరారు.

కాళేశ్వరంతో చెరువులకు జలకళ తెస్తా..
* తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
* పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి, మే 19: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరవువులను నీటితో నింపి జలకళ తీసుకవచ్చి, రైతుల ముఖాలల్లో ఆనందం చూపిస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఊకల్, సన్నూర్ గ్రామాలలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న మన కొత్త రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథకాలతో దేశంలోనే గుర్తింపు తెచ్చుకు న్న రాష్ట్రాంగా నిలిపరన్నారు. రాష్ట్రం లో రైతుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం 24 గంటల నిరంతర విద్యుత్, పెట్టుబడి సాయం కింద సం వత్సరానికి 8 వేల రూపాయలు అందిస్తున్న ఘనత కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. అంతే కాకుండా తెలంగాణ అవిర్భవ దినోత్సవం పూరస్కరించుకుని రైతులకు ప్రత్యేక 5లక్షల భీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. మన దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండలంలో అన్ని గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందిస్తామని అన్నారు. ప్రతి చెరవును నింపి జలకళ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డివో మహేందర్ జీ, తహశీల్ధార్ వాసం రాంమూర్తి, సర్పంచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు.