వరంగల్

పేద ముస్లీంలకు బహుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 19: రంజాన్ పండుగకు పేద ముస్లీంలకు ప్రభుత్వం అందించే బహుమతుల ఎంపిక బాధ్యత మజీద్ కమిటీలకు అప్పగిస్తున్నామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నా రు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ అధికారి ఫణికుమార్, ముస్లీం మత పెద్దలతో, సంబంధిత అధికారులతో రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మజీద్‌లలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆధార్, గుర్తింపు కార్డుల ఆధారంగా ఆయా మసీదులలో ఎన్ని బహుమతులు అవసరం ఉన్నాయో తెలుపాలని అన్నారు. ఇఫ్తార్ విందుకు గల ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గానికి 1500 చొప్పున బహుమతులను పంపామని తెలిపారు. ఇఫ్తార్ విందుకుగాను నియోజకవర్గానికి మూడు మజీద్‌లకు లక్ష చొప్పున మొత్తం 3లక్షల చొప్పున అందివ్వనున్నట్లు ప్రకటించారు. పండుగకు ముందే మజీద్ పరిసరాలను పరిశుభ్రంగా ఉం చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మజీద్ ఇమామ్‌లకు నెల నెలా ఇచ్చే గౌరవవేతనాన్ని ఇప్పించాలని వేడుకున్నారు. అదే విధంగా మజీద్‌లకు వౌళిక సాదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ అందుకు సంబందించిన వౌళిక ఏర్పాట్లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి దరఖాస్తు అందిస్తే ఇజిఎస్ ద్వారా పనులకు నిధులు మంజూరు చేస్తారని అన్నా రు. మత పెద్దలు, ఇమామ్‌ల సమస్యల గురించి తనకు దరఖాస్తు చేసుకుంటే కమిషనర్‌కు నివేదికను పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డివో శేఖర్‌రెడ్డి, వరంగల్ రూరల్ ఆర్‌డీవో మహేందర్‌జీ, నర్సంపేట ఆర్‌డీవో రవి, మూమునూర్ ఏసీపీ శోభన్‌కుమార్, మత గురువు అబ్ధుల్ హామీద్, సలానీబాబా, అధికారులు పాల్గొన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు
తెలుగుదేశం బాసట
* రాజకీయాలలో కీలక మార్పులు టీడీపతోనే సాధ్యం
* కార్యకర్తలను కాపాడుకునే పార్టీ టీడీపీయే
* రాజ్యసభ సభ్యుడు గరికపాటి
* కార్యకర్తలు టీడీపీలోనే: రేవూరి
వడ్డేపల్లి, మే19: దేశ రాజకీయాలలో క్రియాశీలక మార్పుల ను తీసుకవచ్చి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు అన్నారు. శనివారం హన్మకొండలోని ఒక వేడుక మందిరంలో టీడీపీ మినీ మహానాడు వేడుకలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం అధ్యక్షతన జరిగాయి. వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన గరికపాటి మోహన్‌రావు మాట్లాడుతూ టీడీపీలో అతి సామాన్య కార్యకర్త స్థాయి నుండి పార్లమెంట్ స్థాయికి ఎదిగిన ఎంతో మంది ఉన్నారని, కార్యకర్తలు లేకుండా టీడీపీలేదని ఆ ఘనత కార్యకర్తలదేనని కొనియాడారు. తెలంగాణలో గడిచిన 14 సంవత్సరాలుగా టీడీపీ అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు మొక్క వోని ధైర్యంతో ఉంటూ ఇలాంటి మహానాడులను జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని ప్రజలకు సేవ చేయకుండా ఎంతో మంది నాయకులు తమ స్వార్ధం కోసం పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీని నమ్ముకునే జీవిస్తున్నారని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లానుండి నేడు కీలక పదవులు అనుభవిస్తున్నవారు టీడీపీ నుండి వెల్లిన వారేనని గుర్తుచేశారు. ఎంత మంది నాయకులు పార్టీని వీడి వెల్లినా నిజమైన కార్యకర్తలు మాత్రం టీడీపీలోనే ఉన్నారని గుర్తుచేశారు. జిల్లాలో టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్దే తప్ప ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది చేపట్టలేదని తెలిపారు. రాబోయే రోజులు టీడీపీయేనని కార్యకర్తలు ధైర్యంగా సైనికులు వలె పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇనుగాల పెద్దిరెడ్డి, కాశీనాథ్ , శ్రీనివాసాచారి, బొట్ల శ్రీనివాస్, కక్కెసారయ్య, ప్రసాద్‌బాబు, అశోక్ కుమార్, ఇందిర, రఘునాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రైతుబంధు రాష్ట్రాలోనే నెం.1గా నిలిపాం
* టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు
కృతఙ్ఞతతో ఉన్నారు: ఎమ్మెల్యే ఎర్రబెల్లి
పాలకుర్తి, మే 19: రైతుబంధు పథకంతో ప్రజలు కృతఙతతో ఉన్నారని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గత 10 రోజులుగా గ్రామాల్లో పంటసాయం చెక్కుల పంపిణీ విజయవంతమైందని రాజీవ్‌చౌరస్తాలో యూత్ నాయకలు ఆధ్వర్యంలో బాణాసంచకాల్చారు. ఎమ్మెల్యే చేత కేక్‌కట్ చేయించి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరల్ల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో 10రోజుల పాటు 76,154 వేల మంది రైతులకు 1.85లక్షల ఎకారలకు రూ 73.71 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతుబంధు పథకం రాష్ట్రాలోనే నెం1 నిలిపినట్లు చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకల నోళ్ళు మూసుకపోయాయని చెప్పారు. పంటసాయం చెక్కుల కార్యక్రమానికి సహాకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జీసీసీ చైర్మెన్ గాంధీనాయక్, ఎంపీపీ దల్జీత్‌కౌర్ తదితరలు పాల్గొన్నారు.

‘పుచ్చలపల్లి’ అందరికీ ఆదర్శం
* సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
జనగామ టౌన్, మే 19: తమ చివరి శ్వాస ఉన్నంత వరకు పేద ప్రజల కోసం సేవచేసిన పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శమని సీపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. పుచ్చలపల్లి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం జనగామ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి ఇర్రి ఆహల్య అధ్యక్షత వహించగా కనకారెడ్డి మాట్లాడుతూ భారత విప్లవోధ్యమంలో సుందరయ్య కీలకమైన నాయకునిగా బాధ్యలు నిర్వహిం చి దేశా సమగ్రాభివృద్ధి కోసం అనేక సూచనలు చేశాడన్నారు. వర్గపోరాటాల ద్వారనే ఈ సమాజంలో మార్పు వస్తుందనే భావనతో కార్మిక, కర్ష క, కూలీ పోరాటాలను ఉదృతం చేయడానికి ప్రణాళిక రూపొందించాడని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రజల్ని చైతన్యపరిచి పోరాటాలు చేయాల్సిన బాధ్యత సీపీఎం నాయకులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొట్ల శ్రీనివాస్, ఏదునూరి వెంకట్రాజం, గోపి, రాపర్తిరాజు, ఉపేందర్, మీఠ్యానాయక్, రమేశ్, శేఖర్, సత్యనారాయణ, దస్తగిరి, సుధాకర్, కాండ్ర ఆనందంలు పాల్గొన్నారు.