వరంగల్

కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 19: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేస్తున్న ప్రతి పైసా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో లబ్ధి పొందే రైతు అభివృద్ధిలో కనబడుతదని విజయ బ్యాంక్ ఎండి, సీఇవో ఆర్.శంకర్‌నారాయణన్ అన్నారు. శనివారం డిల్లీ నుండి వచ్చిన విజయబ్యాంక్ అధికారుల బృందం హెలిక్యాప్టర్ ద్వారా పెద్దపెల్లి జిల్లాలోని సుందిళ్ళ బ్యారేజి, సిరిపురం పంప్‌హౌజ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ గుండలలోని మేడిగడ్డ వద్ద జరుగుతున్న బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చీప్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆయనకు స్వాగతం పలికి ప్రాజెక్ట్ నిర్మాణం గురించి వివరించారు. అనంతరం వారు కనె్నపల్లి పంప్ హౌజ్‌కు చేరుకొని పంప్‌హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మరో చీప్ ఇంజనీర్ హరిరాం పంప్ హౌజ్ నిర్మాణం వివరాలను, నీటిని ఏత్తిపోసే సామర్ధ్యం వివరాలను వివరించారు. వారు అక్కడి నుండి అన్నారం బ్యారేజి చేరుకోగా జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరు, ఉపయోగిస్తున్న లేబర్‌ల వివరాలు, మిషనరీల సామర్ధ్యం, వేగంగా ఎలా జరుగుతుంది, ప్రాజె క్టు నిర్మాణం వలన తెలంగాణకు కలిగే ప్రయోజనాలను బ్యాంక్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో ఆర్.శంకర్‌నారాయణన్ మాట్లాడుతూ కాళేశ్వరం నిర్మాణ విధానాన్ని ప్రత్యేక్షంగా పరిశీలించడానికే తమ బృందం ఇక్కడికి వచ్చామని, సుందిళ్ళ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం, సిరిపురం, కనె్నపల్లి పంప్ హౌజ్‌ల నిర్మాణాలను పరిశీలించామని అన్నా రు. ఎక్కడ కూడా నాణ్యతలో రాజీ లేకుండా అద్భుతంగా కళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, ప్రాజెక్టు నిర్మాణం పూరె్తై రైతుల పంటపొలాలకు నీరు పారి రైతులు అభివృద్ధి చెందినప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ప్రతి పైసా రైతుల అభివృద్థిలో కనబడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయ న అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.నాగేశ్వర్‌రావు, మురళి రామస్వామి, డైరెక్టర్ వివిఆర్ శాస్ర్తీ, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

జోరుగా జీరో దందా..
* నేరుగా గ్రామాల్లో కొనుగోళ్లు..
* మూతపడ్డ మిల్లుల్లో నిలువలు
* మార్కెట్ ఆదాయానికి భారీగా గండి
* వీలైతే మార్క్‌ఫెడ్‌కు విక్రయాలు..?
కేసముద్రం, మే 19: వ్యాపారుల పేరుతో కొందరు దళారులు గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తూ జీరో దందా సాగిస్తున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అక్రమ వ్యాపారాలకు మూతపడ్డ మిల్లులను కేంద్రాలుగా ఎంచుకొని ఎవరికి కనిపించకుండా రాత్రి వేళల్లో ‘చీకటి’ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో క్వింటాలు మక్కలకు రూ.1000 నుండి 1150 రూపాయల్లోపు ధరకు ఖరీదు చేసిన మక్కలను పౌల్ట్ఫ్రీరాలకు నేరుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులేటెడ్ మార్కెట్ పరిధిలో ఎక్కడ కూడా చిల్లర కాంటాలు నిర్వహించకూడదు. ఒక వేళ ఖరీదు చేసినా ‘రాస్తామాల్’ కింద నమోదు చేసి ఆ సరుకుల విలువలో ఒక శాతం పన్ను మార్కెట్‌కు చెల్లించి ఎగుమతి పత్రం పొంది ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే కేసముద్రం మార్కెట్ పరిధిలో అనేక మంది చిల్లర వ్యాపారులతో పాటు మార్కెట్లో లైసెన్స్ పొందినవారిలో కొందరు నేరుగా గ్రామాల్లో రైతుల నుండి సరుకులు ఖరీదు చేసి మార్కెట్‌కు ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయించిన మద్ధతు ధర కాకుండా, మార్కెట్లో ఈనామ్ విధానంలో ప్రైవేట్ ట్రేడర్లు పెడుతున్న ధరలకు ఇంకా తగ్గించి ఖరీదు చేస్తూ అటు రైతులను, ఇటు మార్కెట్‌ను ముంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఖరీదు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా అక్కడి నుండి ఎగుమతి చేస్తుండగా, కేసముద్రంలో ఖరీదు చేసిన సరుకులను మూలకుపడ్డ గోదాముల్లో, మూతపడ్డ మిల్లులను తమ అక్రమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు. అక్రమ దందాను ఎవరు పట్టించుకోకుండా రాత్రి పూట చీకటి వేళల్లో సాగిస్తున్నారు. రైతుల నుండి వెయ్యి నుండి 1150 రూపాయలకు క్వింటాలు ఖరీదు చేసిన మక్కలను వీలైతే మార్క్‌ఫెడ్‌కు 1425 రూపాయలకు విక్రయించి ప్రభుత్వ మద్ధతు 200 నుండి 250 రూపాయలు అప్పనంగా దళారులు కొట్టేస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. తొలుత 60 కిలోల భర్తీలో కాంటా వేసి తరువాత మార్క్‌ఫెడ్ అధికారులను మచ్చిక చేసుకొని బస్తాలు తీసుకొని రాత్రికి..రాత్రి హామాలీల చేత కాంటా వేయించి 50 కిలోల బస్తాల్లోకి నింపి ట్రక్‌షీట్ పొంది లారీలోకి లోడ్ చేసి తమకు అనుకూలురైన రైతుల పేర్లతో గోదాములకు తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇదే తరహాలో ఓ మూతపడ్డ మిల్లు లో 60 కిలోల మక్కలను కార్పు చేసి 50 కిలోల భర్తీతో తూకం వేసి, లారీలోకి లోడ్ చేస్తున్న ఘటన ‘ఆంధ్రభూమి’ కెమెరాకు చిక్కింది. కేసముద్రం మార్కెట్ పరిధిలో ఈ తరహాలో దాదాపు 50 లారీలకు పైగా దళారులు తక్కువ ధరకు ఖరీదు చేసిన మక్కలను మార్క్‌ఫెడ్‌కు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 200 క్వింటాళ్ల మక్కల లోడును విక్రయిస్తూ లారీకి ఖర్చులు పోను 40 వేల రూపాయలు ప్రభుత్వ మద్ధతును తమ జేబులో వేసుకుంటున్నారు.
తనిఖీలు పూజ్యం - దళారులకు వరం
మిల్లులు, గోదాము ల్లో వాణిజ్య పన్నులశాఖ, మార్కెటింగ్‌శాఖ, పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్‌శాఖల అధికారుల తనిఖీలు కనుమరుగవడంతో జీరో దందా చేసేవారికి వరంగా మారిందంటున్నారు. తరచుగా ఆయా శాఖల అధికారులు మిల్లులు, గోదాములను తనిఖీ చేసి స్టాక్ రిజీష్టర్లు, నిలువలను పరిశీలించాల్సి ఉన్నా అటు వైపు కనె్నత్తి చూడటం లేదంటున్నారు. దీనితో అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారంటున్నారు. నిత్యం 2 నుండి 3 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల టర్నోవర్ సాగిస్తున్న కేసముద్రం మార్కె ట్ పరిధిలో తనిఖీలు చేయకపోవడంతో నిఘా కరువై సగానికి పైగా వ్యా పారం జీరోగా సాగుతోందంటున్నారు. కనీసం మార్కెట్ ఫీజు కూడా కట్టకుండా నేరుగా వ్యాపారం చేస్తూ మార్కెట్ ఆదాయానికి గండిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు గోదాములు, మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ దందాను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.