వరంగల్

విన్నపాలు వినవలె...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 21: ప్రతి సోమవారం కలెక్టర్ల కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్‌సెల్‌కు ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. ఉమ్మడి వరంగ ల్ జిల్లా భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలో ప్రజల నుండి ఆయా జిల్లాల కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరించారు. భూపాలపల్లి జిల్లా గుడ్రాత్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నారం బ్యారేజ్ కింద భూములు కోల్పోయిన బాధితులంతా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో కలెక్టర్ అమయ్‌కుమార్‌ను కలిసారు. తమను ఆర్‌అండ్‌ఆర్ కింద ఆదుకోవాలని కోరారు. ఈసందర్భంగా గుండ్రాత్‌పల్లి గ్రామ రైతులను చట్టపరంగా అన్ని విధాలుగా అదుకొని న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. నూగూరు గ్రామానికి చెందిన అందుడు బెజ్జనీ శ్రీనివాస్, లక్ష్మయ్యలు మాకు ఇచ్చిన పట్టాదారు పాసుబుక్‌ల వివరాలను కంప్యూటర్లలో చేర్చాలని వేడుకున్నారు. ములుగు మండలం మధనపల్లి గ్రామానికి చెందిన 10 నిరుపేద కుటుంబాలకు చెందిన వారు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేయించాలని కోరారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన ఎస్‌టి నాయక్‌పోడు 60 మంది తమకు ఉండానికి ఇళ్లు, భూమి కూడా లేనందున ప్రభుత్వ స్థలం ఇప్పించి అందులో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వేడుకున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి భూ ప్రక్షాళన సవరింపులో తమ పేర్లు మరియు భూమి విస్తిర్ణం తప్పుగా పడిందని దాదాపు 60 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే మీసమస్యలకు పరిష్కారం చూపించి భూరికార్డులను సత్వరమే సవరించి మీకు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ప్రజావాణిలో మొత్తం 122 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. మోహన్‌లాల్, డిఎఫ్‌వో రవికిరణ్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, బీసి సంక్షేమ అధికారిణి శైలజ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ప్రజావాణికి కూడా ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీంతో స్పందిచిన కలెక్టర్లు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.