వరంగల్

తొలగని చెక్కుల చిక్కులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, మే 21: కేసముద్రం మార్కెట్లో ఏదాది క్రితం జాతీయ సాంకేతిక వ్యవసాయ మార్కెట్ (ఈనామ్) విధానం ప్రారంభించినప్పటికీ అందులో ప్రధానమైన ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ నేటికి అమలు చేయడం లేదు. దీనితో రైతులకు చెక్కుల చిక్కులు తప్పడం లేదు. మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించిన తరువాత వ్యాపారులు రైతులకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయకపోవడంతో వ్యాపారులు రైతులకు చెక్కులు ఇస్తున్నారు. రైతులు చెక్కులను తమ ఖాతా ఉన్న బ్యాంక్‌ల్లో జమ చేసిన తరువాత డబ్బు తీసుకోవాల్సి వస్తోంది. అయితే అనేక బ్యాంకుల్లో చెక్కు నగదు కావడానికి వారం నుండి 20 రోజుల వరకు సమయం పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా కొందరు వ్యాపారులు నాన్‌లోకల్ బ్యాంకుల చెక్కులు ఇస్తుండటం, ఇంకొందరు ప్రైవేట్ బ్యాంక్‌ల చెక్కులు ఇస్తుండటంతో అవి తిరిగి.. తిరిగి వచ్చే నగదుగా మారేసరికి పక్షం దాటుతోందంటున్నారు. ఈనామ్ విధానంలో మార్కెట్‌కు రైతు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చిందగ్గర్నుండి.. నగదు తీసుకునేంత వరకు అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈనామ్ విధానం ప్రారంభించి ఏడాది దాటినా నేటికి రైతులకు ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం లేదు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించగానే దడువాయి కాంటా వేసిన తరువాత అక్కడికక్కడే రైతు ఖాతాల్లోకి విక్రయించిన ఉత్పత్తి విలువ నగదు వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉన్నా.. ఆ విధానాన్ని అమలు చేయడానికి సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ కాలయాపన చేస్తున్నారు. దీనితో రైతులు పంట ఉత్పత్తులను విక్రయించడానికి.. విక్రయించిన తరువాత నగదు తీసుకోవడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్ధితి నెలకొంది. చెక్కు బ్యాంక్‌లో డిపాజిట్ చేసి వారమైనా నగదు కాకపోవడంతో బ్యాంక్‌కు వెళితే మీ చెక్కు ఇంకా పాస్ కాలేదంటున్నారని, వ్యాపారి వద్దకెళితే పాస్‌కాని చెక్కు తీసుకొని రమ్మంటున్నారని, ఇలా అటు బ్యాంక్‌కు.. ఇటు వ్యాపారి చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గతంలో ఇక్కడ ప్రత్యక్ష పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతుండగా, ఏ రోజుకారోజు సాయంత్రం వ్యవసాయ ఉత్పత్తులు ఖరీదు చేసిన వ్యాపారి రైతుకు నగదు చెల్లించడంతో ఆ పద్ధతి ఏంతో మేలుగా ఉండేది. ఆ విధానాన్ని తొలగించి జాతీయస్థాయిలో ఈనామ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల వ్యాపారులు మార్కెట్లో ఖరీదులు చేసే అవకాశం కూడా కల్పించలేదు. ఇక్కడి వ్యాపారులే ఈనామ్‌లో టెండర్లు వేస్తున్నారు. అటు జాతీయస్థాయి వ్యాపార విధానం అమలు చేయక, ఇటు ఆన్‌లైన్ చెల్లింపులు చేయకపోవడంతో ఈనామ్ విధానం అమలు తీరుపై రైతులు పెదవివిరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించిన వెంటనే నగదు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్కానర్లు ఏర్పాటు చేయని బ్యాంకులు: రైతుల చెక్కులకు తక్షణ నగదు చెల్లించడానికి బ్యాంకులు కూడా పెద్దగా ఆసక్తి చూప డం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కేసముద్రం మార్కెట్లో రోజుకు కోటి.. సీజన్‌లో అయితే రోజుకు 3 కోట్ల వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఖరీదు జరుగుతుంది. వ్యాపారులకు ఇక్కడ ఉన్న పలు జాతీయ బ్యాంకుల్లో కరంట్ అక్కౌంట్ ద్వారా రైతులకు చెక్కులు జారీ చేస్తున్నారు. ఈ చెక్కులకు తక్షణ నగదు చెల్లింపులు చేయడానికి బ్యాంకులు స్కానర్లు ఏర్పాటు చేస్తే చెక్కును స్కాన్ చేస్తే ఆ వ్యాపారి ఖాతాలో డబ్బులుంటే తక్షణం నగదు చెల్లించే వెసులుబాటుంది. అయితే ఇక్కడ ఉన్న జాతీయ బ్యాంకుల శాఖలు స్కానర్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా అటు వ్యాపారులు, ఇటు బ్యాంకర్ల వైఖరి రైతులకు శాపంగా మారుతోంది.