వరంగల్

స్నేహమంటే ఇదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూన్ 19: నాగరిక సమాజం లో మానవత్వం మరిచిపోయి మనుషులు మరయంత్రాల్లా మారిపోగా.. ఓ శునకం, కొండెంగ కొంత కాలం కలిసిమెలిసి ఉం టున్న తరుణంలో కొండెంగ అకాల మృత్యువాత పడగా, ఆ శునకం తట్టుకోలేక పోతోం ది. కొండెంగను ఖననం చేసిన చోటే ఉంటూ తన స్నేహితుడు ఎప్పుడులేచి వస్తాడోనని ఆశతో నిరీక్షిస్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కలువల గ్రామంలో చోటు చేసుకుంది. ఆకుల సుధాకర్ అనే రైతు గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారడంతో రెండు కొండెంగలను తెచ్చి పెంచుతున్నాడు. ఈ క్రమంలో ఆ కొం డెంగలకు ఆరు మాసాల క్రితం బుల్లి కొం డెంగ జన్మించింది. అయితే పిల్ల కొండెంగ పుట్టిన తరువాత తమ ఇంటి సమీపంలో వేపచెట్టు నీడన కొండెంగను కట్టేసి ఉంచుతున్నాడు. ఈ క్రమంలో సమీపంలో నివాసముంటున్న రాజుల గుట్టయ్య జిప్సీ అనే ఓ శునకాన్ని పెంచుతున్నాడు. బుల్లి కొండెంగకు ఆ శునకానికి స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో అటు కొండెంగ, ఇటు కుక్క కలి సి ఆడుకోవడం నిత్యకృత్యంగా మారింది. అయితే సోమవారం అడవిజాతికి చెందిన మరో కొండెంగ వచ్చి బుల్లికొండెంగను కొట్టిచంపింది. దీనితో గ్రామస్థులు చాలా కాలం గా కోతుల నుండి తమ పంటపొలాలను రక్షిస్తున్న కొండెంగ పిల్ల చనిపోవడాన్ని తట్టుకోలేక ఖర్మకాండలు నిర్వహించారు. చనిపోయిన కొండెంగను గ్రామంలో చెరువు సమీపంలో ఖననం చేశారు. గ్రామస్థులతో పాటు జిప్సీ కూడా శవయాత్రలో పాల్గొని తమ స్నేహితుడైన కొండెంగకు అంతిమ విడ్కోలు పలికింది. అందరిలాగే కొండెంగ ఖననం తరువాత చెరువులో స్నానమాచరించింది. అయితే మంగళవారం ఆకుల సుధాకర్ హైదారాబాద్ నుండి కలువలకు వచ్చి కొం డెంగను ఖననం చేసిన చోటుకు వెళ్లి సమాదిపై పూలమాల వేసి నివాళులర్పించాడు. ఇదే క్రమంలో శునకం కూడా సుధాకర్ వెంట వెళ్లి సమాధి చేసిన చోట మొకరిల్లి విషన్నవధనంతో ఉండటాన్ని చూసి గ్రామస్థులు విశ్వాసానికి మారుపేరుగా శునకాన్ని ఇందుకే పొలుస్తారేమో అంటూ నివ్వెరపోయారు.