వరంగల్

తెలంగాణే మార్గదర్శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 19: రైతాంగ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, వాటి అమలుతీరును దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వరంగల్‌లో రైతుబంధు-జీవిత బీమా పథకం పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రూపొందించిన రైతుబంధు పథకాన్ని గత మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు అమలు చేయడం జరిగిందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతాంగానికి అత్యధిక రాయితిలు కల్పిస్తున్న తెలంగాణ రాష్టమ్రే అని అన్నారు. రైతు జీవిత భీమా ముఖ్యమంత్రి మానసపుత్రిక అని, ఈ అంశంపై ఈనెల 4వ తేదిన హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డీనేటర్లు, తదితర సంబదిత అధికారులతో రైతు జీవితా భీమాపై సాధ్యసాధ్యలపై విధి విధానాలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతు తరుపున ప్రభుత్వమే ఒక్క సంవత్సరానికి 2271 రూపాలయలు ఇన్సూరెన్స్ ఎల్ ఐసి సంస్థకు ప్రిమియం చెల్లింస్తుందని, వచ్చే సంవత్సరం 2019 అగష్టు 14వ తేది దీని గడువు ఉంటుందని, ఆగస్టు 15వతేదిన ప్రభుత్వమే ప్రతి రైతుకు రెనివల్ చేస్తుందని తెలిపారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డీనేటర్ నల్గోండ పార్లమెంట్ సభ్యులు గుత్తసుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబాలను అదుకోవాలని ఆశయంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం అద్భుతం అని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ సీతారాం నాయక్, మంత్రులు అజ్మీరా చందులాల్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విఫ్ వెంకటేశ్వర్లు, కార్పోరేషన్ చైర్మన్లు సుదర్శన్‌రెడ్డి, రాజయ్యయాదవ్, గాంధీనాయక్, వాసుదేవరెడ్డి, జెడ్పీచైర్మన్ గద్దెల పద్మ, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొంట రాజయ్యతో పాటు కలెక్టర్లు అమ్రపాలి, హరిత వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

హరితహారం అత్యంత ప్రాధాన్యత
* కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి

వరంగల్, జూన్ 19: తెలంగాణకు హరితహారం ప్రభు త్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటని, ఏమాత్రం పొరపాట్లు జరుగకుండా నాలుగో విడత హరితహారం కోసం సన్నద్దం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, సంబంధిత శాఖలకు చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యేడాది హరితహారంలో 39 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కల నాటే ప్రాంతాల గుర్తింపులో ముందుస్తుగా పిట్స్ తవ్వకాన్ని తక్షణమే ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ సారి హరితహారంలో స్కూల్ పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, వారినే ప్రతీ ఇంటి హరితహారం వారధిగా గుర్తించాలన్నారు. హరితహారం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25,28 తేదిలో శిక్షాణా కార్యక్రమం ఉంటుందని, సంబంధిత శాఖల నుంచి డీపీఓ, డీఎఫ్‌ఓ, మున్సిపల్, డీఆర్డీవో, వ్యవసాయ, హార్టీకల్చర్ అధికారులు పాల్గొంటారని, వీరే ఆ తర్వాత జిల్లా, మండల స్ధాయిలో శిక్షణ ఇస్తారని వెల్లడించారు. కొత్త పంచాయితీ రాజ్‌చట్టం ప్రకారం నర్సరీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటన్నామని. సిబ్బంది అకింత భావంతో పనిచేస్తేనే హరితహారం విజయవంతం అవుతుందని పీసీసీ ఎఫ్ పీకే. ఝూ అన్నారు. గత యేడాది వరకు కోటి డెబ్బై లక్షల ఈత మొక్కలు నాటామని, రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూరల్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖలకు లక్ష్యాన్ని ఇవ్వడం జరిగిందిని అన్నారు. కోటి పది లక్షల మొక్కలను నాటడం కోసం విభాగాల వారిగా ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. అలాగే పండ్ల చెట్ల కోసం బాగా డిమాండ్ ఉంది అని, వాటిని కొనుగోలు చేయడానికి అత్యవసర నిధులను కూడా కలెక్టర్ హరిత అడిగారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒప్పుకున్నారు.