వరంగల్

సమస్య పరిష్కరించేదాకా సాగుచేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 19: సమ స్య పరిష్కరించబడేంతవరకు లంబా డ, ఆదివాసీ రెండు వర్గాల వారు పొడుభూములను సాగుచేయవద్దని కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మహబూబాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొత్తగూడ మండలంలోని గ్రామాల ఆదివాసీ, లంబాడ వర్గాల మద్య పొడుభూమి సాగువిషయంలో వచ్చిన తగాదాను పరిష్కరించేందుకు ఇరు వర్గాల తో జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలసి కలెక్ట ర్ మాట్లాడారు. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు తమ వాదనలను జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఎస్పీ కోటిరెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. సాగుచేస్తున్న భూమి అటవీ భూమి అని సాగుచేయడానికి గల హక్కుపత్రాలు దరఖాస్తు రూపంలో వారి వద్ద ఉన్న ఆధారాలతో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. సుమారు 300 ఎకరాల భూమిపై సంబందిత అధికారులతో సర్వే చేయించనున్నట్లు, స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నష్టపోతారని తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరిగినా స్థానిక ఎస్సై, సీఐ, డీఎస్పీలకు సమాచారం అందించాలని దస్తావేజులు కొనుగోలు హక్కు పత్రాలను పరిశీలించిన తర్వాత వాటిపై విచారణ జరిపి సమస్యను పరిష్కరించనున్నట్లు కలెక్టర్ ఇరువర్గాలతో ముఖాముఖి మాట్లాడారు. సరైన హక్కుదారులను గుర్తిస్తామని, నివేదిక వెలువడేంతవరకు ఇరువర్గాలు భూమినిసాగుచేయడం గాని, ఘర్షణలకు దిగడం చేయవద్దని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్‌దామోదర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, డిఎఫ్‌ఓ కిష్టాగౌడ్, డీఎస్పీ రాజారత్నం, గూడూరు సీఐ రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.