వరంగల్

గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 17: ఆగష్టు ఒకటినుండి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లు, 12,751 గ్రామ పంచా యతీలో స్పెషల్ ఆఫీసర్లు నియామకాలకు సంబంధించి ప్రతి పాదనలను రెండు రోజుల్లోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌కే.జోషి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం, హరితహారం, మత్స్యశాఖ, పాడిగేదల పంపిణీ, వివిధ కేసులకు సంబంధించిన మెడికల్, పోస్టుమార్టం నివేదికలు, లారీల సమ్మె తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కార్యదర్శి అజయ్‌మిశ్రా, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, పంచాయితీ రాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, పట్టణాభివృద్ధిశాఖ, ముఖ్యకార్యదర్శి ఆర్వింద్‌కుమార్, మత్య్సశాఖ, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్, సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 12,751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, 565 గ్రామ పంచాయితీ క్లస్టర్లకు ఇన్‌చార్జిలుగా గ్రామ పంచాయతీ సెక్రటరీలను, 68 నూతన మున్సిపాలిటిలకు మున్సిపల్ కమిషనర్లుగా తహాశీల్ధార్లు, స్పెషల్ ఆఫీసర్లగా ఆర్‌డీవో లేదా జిల్లా స్ధాయి అధికారులను నియమించే ప్రతిపాదనలను రూపొందించి రెండు రోజుల్లో మున్సిపల్ కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఆదేశించారు. మున్సిపాలటీలకు సంబంధించి ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిం చి జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని, కొన్ని మండలాలకు ఒకటికంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్ధలు ఉంటే దానికనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. గ్రామ పంచాయతీలోని మినిట్స్ పుస్తకాలను సీజ్‌చేసి, కొత్త మినిట్స్ పుస్తకాలను తెరవాలని అన్నారు. కొత్త మున్సిపాలటీల కార్యాలయాల వద్ద బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. భూసేకరణ ప్రకటనను సమాచారశాఖ ద్వారానే జారీ చేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అయితే కొంత మంది కలెక్టర్లు నేరుగా భూసేకరణ ప్రకటనలను జారీ చేస్తున్నారని అన్నారు. ఇకముందు సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి పోస్టుమార్టం నివేదికలు, మెడికల్ రిపోర్టులు జిల్లాల వారిగా పెండింగ్ లేకుం డా చూడాలని సీఏస్ ఆదేశించారు. 15 రోజుల తరువాత పురోగతిపై సమీక్షిస్తామన్నారు. వివిధ కేసులకు సంబంధించి మెడికల్, పోస్ట్‌మార్టం నివేదికలు జాప్యం లేకుండా చూడాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కలెక్టర్లను కోరారు. ఆర్టీవోల ద్వారా ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్స్ జారీ వేగవంతం చేయాలన్నారు. టైం బాండ్ పద్దతిలో రిపోర్టులు సమర్పింలచాలన్నారు. ఈ నెల 20 నుండి లారీల సమ్మెకు ప్రైవేటు యజమానులు పిలుపు నిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మమాట్లాడుతూ సమ్మె విషయంలో లారీల అసోసియేషన్లు రాష్ట్రానికి సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ సందర్భంగా హమాలీలు అదనంగా డబ్బులు అడుతున్నారని తెలిపారు. ఈ విషయమై ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఒక ముందు అలా జరగకుండా చూడాలని సూచించారు. ఓవర్ లోడింగ్ అరికట్టాలని, డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా చూడాలని కలెక్టర్లు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.