వరంగల్

ఓరుగల్లు అభివృద్ధికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 17: ఓరుగళ్లు అభివృద్ధికి పోలీసులతోపాటు ఆర్టీసీ, ఆటోడ్రైవర్లు, ప్రైవేట్ వాహన యాజమానులు సహకరించాలని పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ పిలుపు నిచ్చారు. మంగళవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో త్రీనగరి పరిధిలోని ఆటో డ్రైవర్లతో కమిషనర్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ స్థాయిలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. శాంతి భద్రతలతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అభివృద్ధి ఆధారపడి ఉం టుందని తెలిపారు. వరంగల్ నగరమంటే క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు సాధించాల్సిన అవసరం ఉందని, కమిషనరేట్ పరిధిలో 25వేల పైగా ఆటోలతోపాటు ఎన్నో వాహనా లు తిరుగుతున్నాయని, వీటి నియంత్రణకు వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అదే సమయంలో వాహనదారులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన భాద్యత ఉండాలని కోరారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 432 మంది ప్రాణాలు కొల్పోవడం ద్వారా వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం అతిముఖ్యమైందని, క్రమశిక్షణారాహిత్యం వల్ల ప్రమాదాల్లో ప్రాణా లు కొల్పోవద్దని హితువు పలికారు. స్కూల్ పిల్లలను తరలించే క్రమంలో ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ పాటించాలని కోరారు. గత మూడేళ్లల్లో ఆటోల ద్వారా 93 మంది ప్రాణాలు కొల్పోగా, 502 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. కార్యక్రమానికి ముందుగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఆటోల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వ్యవహరిస్తున్న తీరుపై, డ్రైవర్లు కు అవగాహన కల్పించే చాయ చిత్రా లు, వీడియోలను పోలీసు అధికారులు ప్రదర్శించారు. సమావేశానికి హాజరైన ఆటో డ్రైవర్ల చేత సీపీ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ మురళీధర్, రోడ్డు రవాణా అధికారి రవి, ఏసీపీ ప్రభాకర్, సీఐలు పాల్గొన్నారు.