వరంగల్

బయ్యారం ఉక్కు.. మా న్యాయమైన హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 17: బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కు అని దానికి గండికొట్టాలని చూస్తే ఉద్యమాలతో తిప్పికొడుతామని బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. మానుకోటలో మంగళవారం సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని 13వ క్లాజ్‌లో మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో 30వేల కోట్లతో ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఇప్పుడు తప్పుడు నివేదికలతో బయ్యారంలో ఉక్కుపరిశ్రమ సాధ్యంకాదని ప్రచారం చేయడం ప్రభుత్వాల చట్ట ఉల్లంఘన చర్యల్లో భాగమే అని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మోసపూరిత ప్రకటనలతో ఇప్పటికీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉక్కుపరిశ్రమ ఏర్పాటు పట్ల చిత్తశుద్ది లేదనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. బయ్యారం ఉక్కు మానుకోట హక్కు అనే నినాదంతో ఈ నెల 25వ తేదీ బుధవారం రోజున బయ్యారం గుట్ట నుండి మానుకోట నెహ్రుసెంటర్ వరకు వేలాదిమంది కార్యకర్తలతో, నాయకులతో ఉక్కుసాధన ఉద్యమకారులతో కలసి మహాపాదయాత్రను నిర్వహించడం జరుగుతుందని తమ్మినేని తెలిపారు. ఈ పాదయాత్రలో తనతోపాటు బీఎల్‌ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సుర్యప్రకాశ్, రాష్ట్ర కో కన్వీనర్ మద్దికాయల అశోక్, బీఎల్‌ఎఫ్ భాగస్వామ్య పార్టీల, ప్రజాసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకత్వం పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీయం రాష్టక్రార్యవర్గ సభ్యులు సుదర్శన్, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,గునిగంటి రాజన్నలు పాల్గొన్నారు.

ఉద్యమంలో పాల్గొనని వారికి మంత్రి పదవులా?: పొన్నం
భీమదేవరపల్లి, జూలై 17: తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నేతలకు రాష్ట్ర మంత్రి వర్గంలో సగానికి పైగా అవకాశం కల్పించడంపై టీపీసీసీ ఉపాధ్యాక్షులు పొన్నం ప్రభాకర్, హూస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమదేవరపల్లి మండలంలోని ఆరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ భూత్ కమిటీల నియామకం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణామాఫీ ఏక కాలంలో ఇస్తామని అన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలకు 3 వేల జీవనభృతి అందజేస్తామని అన్నారు. దివగంత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేపట్టిన సంస్కరణల వల్లనే నేడు ప్రతి ఇంటికి రెండు సెల్‌ఫోన్లు వచ్చాయని అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రాణాలు పణంగా పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు, మనవడు, మనవరాలుతో సహా సోనియాగాంధీ ఇంటికి వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతామని ఆనాడు ఫోటోలు దిగి నేడు సోనియాగాంధీని దుయ్యబట్టడం సమంజసమా ? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతే ఏ ఒక్క కుటుంబాన్ని అందుకోని కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే హక్కులేదని అన్నా రు. టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో ఏ ఇతర పార్టీ చెందిన ఏ ఒక్కరికికూడా సంక్షేమ పథకాలు అందించలేదని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియాకు రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు నిమ్మల వేమురెడ్డి, లక్ష్మరెడ్డి, రాంచంద్రం, పత్తిపాక కొంరెల్లి తదితరులు పాల్గొన్నారు.