వరంగల్

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,జూలై 17: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు.మహబూబాబాద్‌లో మంగళవారం ‘ఆపరేషన్ ముష్కన్’ కార్యక్రమంపై 16 మండలాల బాధ్యులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముష్కాన్ 4వ దశ కార్యక్రమంలో చదువుకు దూరమై హోటళ్లు, నగల దుఖాణాలు, మెకానిక్‌షెడ్‌లు, దాబా హోటళ్లలో పనిచేస్తున్న 25 మంది బాలలకు విముక్తి కల్పిం చి చైల్డ్‌లైన్‌వారికి అప్పగించడం జరిగిందన్నారు. గతంలో కంటే ఇప్పుడు బాలకార్మికులు తక్కువైయ్యారని జూన్, జూలై రెండు విడుతల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముష్కాన్ ద్వారా సత్ఫలితాలు వచ్చాయన్నారు. బాలకార్మిక రహిత జిల్లాగా మానుకోటను మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎవరైనా 18 సంవత్సరాలలోపు పిల్లలను పని లో పెట్టుకున్నట్లు కనిపిస్తే వెంటనే 1098 నెంబరుకు గాని, లేదా పోలీస్‌వారికి గాని తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిదర్, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్, టౌన్ సీఐ తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

హామీల సాధనలో కేసీఆర్ విఫలం

* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపణ

వరంగల్, జూలై 17: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం హన్మకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేంద్రంతో సీఏం కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిలో ప్రతిపక్షంగా, లోపల మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నాడని దు య్యబట్టారు. రాష్ట్ర హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాల ప్యాకెజీ, ఏదేని ప్రాజక్టుకు జాతీయ హోదాలాంటి విభజన చట్టంలో పేర్కోన్న హామీల సాధనలో కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియమాకాలు మనకే దక్కుతాయని చెప్పి, నాలుగేళ్లు గడుస్తున్నా కేవలం 35 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయని అసమర్ధ ప్రభుత్వం మరొకటి లేదని ఆరోపించారు. సంక్షేమ, రుణాల మంజూరులో 90 శాతం ఆపార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేసారని ఆరోపించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల వాయిదాకు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమైందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ నాలుగేళ్లపాలనలో ప్రజలు రోడ్డున పడ్డారని, పట్టాదారు పాసుపుస్తకాలకోసం రైతులు రోజూ ఎమ్మార్వో కార్యాలయాల చూట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సమగ్ర భూసర్వే జరపకుండా భూ ప్రక్షాళన ఎలా జరుగుతుందని సీపీఐ అనాడే చెప్పిందని, భూప్రక్షాళన కారణంగా అసలైన భూమి పుత్రులకు న్యాయం జరగలేదని అన్నారు. దొంగలు, ఖబ్జాకోరులకే భూప్రక్షాళన అనుకూలంగా మారిందని విమర్శించారు. ఎల్కతుర్తిలో అధికారిణి నిలదీసిన రైతుపై కేసులు పెట్టి జైలుకు పంపారని, భూప్రక్షాళన బోగస్ ప్రక్షాళనగా మారిందని ఆరోపించారు. ఈ భూప్రక్షాళన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతి తహశీల్ధార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సిరిబోయిన కరుణాకర్, సహాయ కార్యదర్శి బిక్షపతి పాల్గొన్నారు.