వరంగల్

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో.. షేర్వాల్ టెక్నాలజీ బాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 20: దేశం అంతట షేర్వాల్ టెక్నాలజీ పద్దతుల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడితే బాగుంటుందని కేంద్ర హౌజింగ్ శాఖ అధికారిణి వి.కాంత్రి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేశాలపల్లి గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ అమయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్ రూం పేదలకు ఒక వరం లాంటిదని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును పరిశీలించడానికి నీతి అయోగ్‌చే జిల్లాకు వచ్చి, డబుల్ బెడ్‌రూం గృహ నిర్మాణాలను పరిశీలించారు. ధనవంతులు నివసిస్తున్న అన్ని సౌకర్యాలు గల ఇండ్ల మాదిరిగానే నిరుపేదలు కూడా నివసించాలనే గొప్ప అశయంతో డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని దీనిలో భాగంగా వేశాలపల్లిలో షేర్వాల్ టెక్నాలజీలో అత్యంత నాణ్యతగా గృహాలును నిర్మస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమెకు వివరించారు. కేంద్ర హౌసింగ్ శాఖ అధికారి కాంత్రి మాట్లాడుతూ తక్కువ కాలంలోనే ఇంత నాణ్యతతో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం చాలా గొప్పపని అని ఇలాంటి నిర్మాణాలు దేశం అంతా నిర్మిస్తే బాగుంటుందని అన్నారు. ఈ ఇండ్లలో నివసించబోయో నిరుపేదలు నిజంగా అదృష్టవంతులని ఈ ఇండ్లలో నివసించడం పేదలకు ఒక వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణమాచారి, పంచాయితీరాజ్ డీఈ తదితరులు పాల్గొన్నారు.