వరంగల్

లాటరీ కొనసాగించాలా.. వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూలై 20: సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో ఎంపికైన లబ్ధిదారులు ఈ స్కీంను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జనగామ కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి కోరారు. ఐఎఫ్‌డీ స్కీం కోసం గత కొన్ని మాసాల కిందట దరఖాస్తు చేసుకున్న వారిలో లబ్ధిదారులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేశారు. శుక్రవారం జనగామ ఓం సాయి గార్డెన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి హాజరై స్కీం ప్రాధాన్యతను వివరించారు. మత్స్యకార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటును వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ స్కీంలో 20 రకాల యూనిట్లు ఉండ గా రెండు రకాల యూనిట్లకు మాత్ర మే లాటరీ పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. డీఎఫ్‌వో పిల్లి శ్రీపతి మాట్లాడుతూ టూ విలర్స్(టీవీఎస్ ఎక్సెల్) కోసం 2072 మంది చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి 1835 మంది లబ్ధిదారుల గుర్తించామన్నారు. లగేజి ఆటో లు, సంచార చేపల రవాణ వాహనాలకు మాత్రమే లాటరీ పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని అన్నారు.
* దరఖాస్తుదారులందరికీ స్కీం వర్తింపచేయాలి
దరఖాస్తు చేసుకున్న మత్స్యకారులందరికీ ఈ స్కీంను వర్తింపచేయాలని మత్స్యకార్మిక సంఘం జనగామ జిల్లా కార్యదర్శి మునిగెల రమేశ్ ఆధ్వర్యంలో మత్స్యకారులు అధికారుల ముందు నిరసన వ్యక్తం చేశారు. లాటరీ ప్రక్రియను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు అధికారుల ఎదుట బైఠాయించి నినాదా లు చేశారు. ఈ సందర్భంగా మునిగె ల రమేశ్ మాట్లాడుతూ లాటరీ పద్దతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయ డం వల్ల ఒక్కరిద్దరికే న్యాయం చే కూరి మిగతావారందరూ నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి జోక్యం చేసుకొని ప్రభుత్వం నిబందనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. మీ అభిప్రాయాన్ని వినతి పత్రం రూపంలో తమకు అందచేస్తే ప్రభుత్వానికి తెలియచేస్తానని అన్నారు. అంతే తప్పా ఆందోళన చేయడం వల్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని సముదాయించారు. లాటరీ పద్దతిని కొనసాగించాలా.. వద్దా..? అని దరఖాస్తుదారులందరిని కోరగా అందులో మెజార్టీగా లాటరీ పద్దతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని నినాదాలు చేయడంతో ప్రక్రియను ప్రశాంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్‌డీవోలు వెంకటేశ్వర్‌రెడ్డి, రమేశ్, మత్స్యపారిశ్రామిక సహాకార సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు దుస్స మల్లేశం, చింతల యాదయ్యలు, మత్స్యశాఖ సిబ్బంది వెంకటేశ్వర్లు, పూర్ణచందర్, దీపక్, సాంబరాజులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సధానందం, జిల్లా ప్రచార కార్యదర్శి ఇట్టబోయిన రమేశ్, జనగామ, పాలకుర్తి నియోజక వర్గాల ఇంఛార్జీలు సిలివేరు లింగం, చిక్కుడు రాములు, నాయకులు వం గాల గోవర్ధన్, నర్సింహులు, మాచర్ల ఎల్లయ్య, ప్రభాకర్, ఇట్టబోయిన కుమారస్వామిలు పాల్గొన్నారు.

ప్రతిభకు కొలమానం మార్కులు కాదు
* ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి: లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ
తొర్రూరు, జూలై 20: ప్రతిభకు కేవ లం పరీక్షల్లో వచ్చే మార్కుల మాత్రమే కొలమానం కాదని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్‌నారాయణ అన్నా రు. శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలతోపాటు మండలంలోని కంఠాయాపాలెం, హరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 100 మైల్స్ చారిటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ హంట్ ఫౌండేషన్ వారి సహకారంతో సుమా రు 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీలు, సైన్స్ పరికరాలు, పుస్తకాల శాలలను ఆయన లాంచనంగా ఫ్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు మేథస్సులో మెరికల్లాంటి వారని, పేదరికం, ఇతర సమస్యలను ధీటుగా ఎదుర్కొంటూ విదేశి విద్యార్థులతో పోటీపడి ప్రపంచస్థాయిలో ఉన్నతంగా రాణిస్తూ దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలీస్తే భారతదేశంలోనే పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య ఎక్కువగా ఉందని డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని వాటిని అందుకునేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో కృషిచేయాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నె సోమయ్య, ఎంపీడీవో బాబు, ఎంఈవో బుచ్చ య్య, సర్పంచ్ రాజేష్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, 100 మైల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మనోజ్, కల్పణ, గ్లోబల్ హంట్ ప్రతినిధులు మేఘ, మెహత్ పాల్గొన్నారు.