వరంగల్

టీఆర్‌ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 20: పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కైవసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో అవిశ్వాస ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. టీఆర్‌ఎస్ శిబిరంలో ఉన్న మహిళా కౌన్సిలర్ కాంగ్రెస్ గూటికి చేరారనే వ్యాఖ్యలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ గూటికి టీఆర్‌ఎస్ కౌన్సిలర్ చేరడంతో అవిశ్వాసం వీగిపోతుందనే ధీమాను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంఖ్య పరంగా పూర్తి బలం రావడమే కాకుండా మరో ఇద్దరు తెరాస కౌన్సిలర్లు టచ్‌లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు పేర్కొనడంతో పరకాలలో రాజకీయ వాతావరణం వేడేక్కింది. కాంగ్రెస్ గూటికి టీఆర్‌ఎస్ కౌన్సిలర్ చేరడంతో పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై ప్రవేశ పెట్టిన అవిశ్వాసంపై చర్చ ఇప్పుడు పరకాలలో హట్‌హట్ టాఫిక్‌గా మారింది. సొంత పార్టీకి చెందిన చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, బీజేపీ పార్టీకి చెందిన వైస్ చైర్‌పర్సన్ దేవునూరి రమ్యక్రిష్ణపై టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెర లేపారు. కలెక్టర్‌ను కలిసి కౌన్సిలర్లు సంతకాలు చేసిన పత్రాన్ని అందచేశారు. కలెక్టర్ హరిత ఈనెల 26న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వేరువేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ 13 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ఓటుతో అవిశ్వాసాన్ని నెగ్గుతామనే ధీమాతో టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఇదే సమయంలో ఒకరిద్దరిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు మంతనాలు చేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వారిని విమానంలో బెంగళూరుకు తరలించారు. అదే రాత్రి శిబిరంలో ఉన్న మహిళా కౌన్సిలర్ బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి కనిపించకుండా పోయారనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళ కౌన్సిలర్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఆమె కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు సమాచారం. దీంతో ఎనిమిది మందితో ఉన్న కాంగ్రెస్ శిబిరాన్ని బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించారు. అంతేకాకుండా మెజార్టీ సభ్యులు లేనట్లయితే అవిశ్వాసం వీగిపోతుందని పరకాల మున్సిపల్ పీఠం తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.