వరంగల్

నేరాల అదుపునకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 20: వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద హత్యకు పాల్పడిని నలుగురు నిందితులపై శుక్రవారం పీడీయాక్టు నమోదు ఉత్తర్వులను పోలీసు కమిషనర్ డా. విశ్వనాధ రవీందర్ జారీచేశారు. దయానంద కాలనీకి చెందిన తైతాల సాంబయ్య హత్యకు పాల్పడిన నలుగురు నిందితులపై పీడీయాక్టు ఉత్తర్వులు జారీ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులు వరంగల్ బాలాజీ నగర్‌కు చెందిన పత్తి కుమార్, గొర్రెకుంట కీర్తీనగర్‌కు చెందిన గంధం నరేష్, కాశీబుగ్గ పద్మానగర్‌కు చెందిన పత్రి సోమేశ్వర్, కాసర్ల రాజ్‌కుమార్‌పై పీడీయాక్టు నమోదు చేయడం జరిగింది. పోలీసు కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ వరంగల్ సెంట్రల్ జైళ్లో నలుగురు నిందితులకు జైలర్ సుక్రునాయక్ సమక్షంలో పీడీయాక్టు నిర్భంధ ఉత్తర్వులను అందజేశారు. ఏప్రిల్ 22వ తేదీన దయానంద కాలనీ ప్రాంతానికి చెందిన తైతాల సాంబయ్యను నలుగురు నిందితులు బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఏనుమాముల మార్కెట్ ప్రాంతంలో మృతుడు సాంబయ్య మొండెం ఉన్న గోనే సంచిని వదిలేసి వెళ్లారు. తల ఉన్న గోనేసంచిని కాశీబుగ్గ జంక్షన్‌లో వదిలిపెట్టి వెళ్లి పోయారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ నేర రహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగానే కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి, ప్రతికార చర్యలు జరగకుండా ఉండేందుకు గాను ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. నగరం లో నేరాలు పునరావృతం కాకుండా ఉండేందుకు నలుగురు నిందితులపై పీడీయాక్టు జారీ చేయడం జరిగిందన్నారు.
అభివృద్ధిపై ప్రజాభిప్రాయ సేకరణ
నర్సంపేట, జూలై 20: నర్సంపేట పట్టణ అభివృద్ధిపై శుక్రవారం పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్, మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పెద్ది మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ రూ.20కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేశారని చెప్పారు. ఈనిధులతో పట్టణంలో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేస్తామని, అదే విధంగా మిగిలిపోయిన డివైడర్, గ్రిల్స్, గ్రీనరీ, ఓపెన్ జిమ్, ఆడిటోరియం, కుమ్మరికుంట పార్కు అభివృద్ది, బీటీ రోడ్ల రెన్యువల్ పనులు చేయిస్తామని వెల్లడించారు. ఆగస్టు మూడ వ వారంలో మంత్రి కేటీఆర్ పర్యటన నర్సంపేటలో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని పనులకు మంత్రి కేటీఆర్ తగినన్ని నిధులు కేటాయించనున్నారని వివరించారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్, కామగోని శ్రీనివాస్‌గౌడ్, ఎంవీ.రామారావు, మోతె జయపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, వైద్యులు, వ్యాపార ప్రముఖులు, విద్యాసంస్థల యజమానులు పాల్గొన్నారు.

‘డబుల్’ నిర్మాణాలు త్వరతగతిన పూర్తి చేయాలి
* జడ్పీటీసీ నారాయణరెడ్డి
కాటారం, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కాటారం జడ్పీటీసీ చల్ల నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కాటారం మండలంలోని మెదిపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన సంబంధిత ఏఈతో కలి సి లబ్ధిదారులతో క్షేత్రస్థాయిలో మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయుటలో లబ్ధిదారులు సైతం ముందంజలో ఉండాలని, సంబంధిత ఇం జనీరింగ్ అధికారులతో కలిసి నాణ్యతతో కూడిన ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు. మధ్యదళారీలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులు ఇండ్లు నిర్మాణం జరిపించుకోవాలని అన్నారు. బిల్డింగ్ నమూనా ప్రకారం జరుగుతాయ ని లబ్ధిదారులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. బిల్డింగ్‌లకు అవసరమగు మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఆయన వెంట అంకూసాపూర్ గ్రామ సర్పంచ్ లిక్కి లావణ్య శ్రీనివాస్, లబ్ధిదారులు పాల్గొన్నారు.