వరంగల్

లక్నవరంకు పొటెత్తుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావపేట, జులై 21: ఇటివల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అన్ని చిన్న చిన్న చెఱువులు పూర్తిగా నిండిపోగా అన్నదాతలకు కల్పతరువైన లక్నవరం చెఱువుపూర్తిస్ధాయిలో నిండేందుకు సిద్దంగా ఉంది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో బొగ్గులవాగు వరద ఉధృతికి లక్నవరం చెఱువు నీటి సామర్ధ్యం 31 అడుగులకు వచ్చి చేరింది. 33 అడుగుల సామర్ద్యంగల లక్నవరం చెఱువు మత్తడి పడితే ఖరీఫ్,తోపాటు రబీ పంటలకు ఢొకా ఉండదు. చెఱువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మరో రెండు రోజులలోనే చెఱువు మత్తడి పడే అవకాశాలు ఉన్నాయని స్ధానికులు తెలిపారు. కాగా లక్నవరం చెఱువులోకి 31 అడుగులు నీరు వచ్చి చేరడంతో స్ధానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇనగాల నిరహార దీక్ష ఫలితమే పరకాల రెవెన్యూ సాకారం
* పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రఘుపతిగౌడ్
పరకాల, జూలై 21: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇనగాల వెంకట్రాంరెడ్డి 56 గంటల నిర్వీరామ నిరహార దీక్ష ఫలితమే పరకాల రెవెన్యూ డివిజన్ సాకారం అయిందని పరకాల పట్టణ కాం గ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క రఘుపతిగౌడ్ అన్నారు. శనివారం ఇనగాల వెంకట్రాంరెడ్డి చిత్రపటానికి మార్క రఘుపతిగౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతిగౌడ్ మాట్లాడుతూ పరకాల ప్రజల చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ సాధనకై ఇనగాల వెంకట్రాంరెడ్డి 56 గంటల పాటు నిర్వీరామ నిరహార దీక్షకు మద్దతుగా నిలిచిన అఖిల పక్షం నాయకులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు, పత్రిక విలేకరులకు, ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న పరకాల ప్రజలకు, కుల సంఘాలకు పరకాల పట్టణ కాంగ్రెస్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో పట్టణ ఉపాధ్యక్షులు మాదాసి రాంమూర్తి, జిల్లా నాయకులు ఒంటేరు సార య్య, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్క అభినవ్‌గౌడ్, యూత్ కాం గ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మచ్చ సుమన్, బొచ్చు జెమిని, రేవంత్‌రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, కొయ్యడ రాజేష్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు దూలం అనిల్, పున్నం భానుప్రసాద్, గాలీఫ్, సాయిక్రిష్ణ, మణికంఠ, సాంబయ్య, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.