వరంగల్

గాడిలో పడ్డ రిజిస్ట్రేషన్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూలై 21: కేసముద్రం తహశీ ల్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా చేపట్టి న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గాడిలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 12 నుండి రాష్ట్రంలో ఎంపిక చేసిన మండలాలల్లోని తహశీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. గతంలో భూములు కొన్నా, బహుమతిగా ఇవ్వాలన్నా, చట్ట బద్దంగా వివాహాలు చేసుకోవాలన్నా, బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లకు జిల్లా కేంద్రాలు, లేదంటే డివిజన్ కేంద్రాల్లోని సబ్ రిజిస్ట్రార్, లేదంటే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేంది. భూములు కొన్నా, ఆస్తులు మార్పిడి చేసినా తిరిగి తహశీల్ ఆఫీసు, గ్రామపంచాయతీలకు వచ్చి మ్యూటేషన్ చేయించుకోవాల్సి వచ్చేంది. అయితే ఈ పద్ధతికి స్వస్తి పలికి స్థానికంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించడంతో పాటు అప్పటికప్పుడే మ్యుటేషన్ చేయించి, రికార్డుల్లో నమోదు చేసి ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రభుత్వం తహశీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. అయితే తొలుత అన్‌లైన్ మొరాయించడం, తరచుగా సర్వర్ డౌన్ కావడం, నెట్ స్పీడ్ లేక పోవడం లాంటి సమస్యలతో కొన్ని బాలారిష్టాలను ఎదుర్కొన్నప్పటికీ క్రమక్రమంగా సమస్యలను తొలగించడంతో ఇప్పుడు తహశీల్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏలాంటి అవంతరాల్లేకుండా సాఫీగా సాగుతోంది. ఇప్పటి వరకు కేసముద్రం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 110 భూమి, ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్లు చేయగా, 38 మార్టిగేజ్ రుణం కోసం రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే 56 గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేయగా, 128 మంది వివాహ రిజిష్ట్రేషన్లు చేయించుకోవడం విశేషంగా మారింది. కాగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఇప్పటి వరకు 17 లక్షల 6వేల 237 రూపాయల ఆదాయం సమకూరిందని స్థానిక సబ్ రిజిస్ట్రార్, తహశీల్ధార్ యోగీశ్వర్‌రావు తెలిపారు. ప్రజలకు స్థానికంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహించడంతో పాటు ఎలాంటి సమస్యలున్నా నేరుగా సలహాలు, సూచనలను పొందుతూ ఆటంకం లేకుండా సత్వరం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. కాగా ధరణిలో మ్యూటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని, ధరణి కోసం నిరీక్షిస్తున్నట్లు తహశీల్ధార్ తెలిపారు. త్వరలో ధరణి కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు.