వరంగల్

నులిపురుగు నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 21: నులిపురుగు నివారణ కోసం 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని జయశంకర్‌భూపాలపల్లి కలెక్టర్ అమయ్‌కుమార్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య, విద్య శాఖ, స్ర్తి శిశుసంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 10న జాతీయ నులిపురుగు దినోత్సవం అయినందున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు కడుపులో నులిపురుగులు తయారవడం మూలంగా పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని వీటిని నివారించుటకు పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగు నిరోధిక మాత్రలైన అల్బెండజోల్ మాత్రను వేయించాలని అన్నారు. జిల్లాలో గల అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వైద్య ఆరోగ్యశాఖ, 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్ర వేయ్యాలని ఆదేశించారు. ఈ మాత్ర చాల సురక్షితమైందని, ఈ మాత్ర వలన పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగదని అన్నారు. చాలా ఆరోగ్యవంతంగా తయారవుతారని అన్నారు. అలాగే విద్యార్ధులకు ప్రైవేటు పాఠశాలల కళాశాలల ప్రిన్స్‌పాల్స్, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి అన్ని విద్యా సంస్ధతో ఖచ్చితంగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో నులిపురుగు నివారణ మాత్రలు వేయడానికి అన్ని సిద్ధం చేశామని ప్రతి అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, కళాశాలల వద్ద ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను మాత్రలు వేసేందుకు సిద్ధం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పి మోహాన్‌లాల్, కేంద్ర ప్రభుత్వం హోం, అర్బన్ ఎఫైర్ అండర్ సెంటరీ రాజేశ్‌కుమార్, సీపీవో కొంరయ్య, తదితరులు పాల్గొన్నారు.