వరంగల్

1000 కోట్ల అభివృద్ధి అంటే బురద రోడ్లా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 21: స్థానికేతరుడైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పరకాల నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వచ్చిందని వరంగల్ రూరల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నోజు శ్రీనివాసాచారి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని మల్లారెడ్డిపల్లిలో బురదమయంగా మారిన రోడ్డును సందర్శించారు. చిన్నారులు, పాఠశాల విద్యార్థు లు, స్థానికులు నడవకుండా ఆధ్వాన్యం గా ఉన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి రోడ్డుపై వరి నారును తీసుకొని నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గన్నోజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అభివృద్ధి ముసుగులో అక్రమంగా సంపాదించిన సోమ్మును పరకాల మున్సిపల్ అవిశ్వా సం పేరుతో ఖర్చు చేసిన ఆయన ఆట లు సాగవన్నారు. ఒక శాసన సభ్యులుగా ఉన్న వ్యక్తి కాంట్రాక్టులు చేయకూడదని నిబంధలు ఉన్న తనకు సం బంధించిన సంస్థ ద్వారా బినామీ కాం ట్రాక్టులు చేస్తూ నాణ్యత లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుతింటూ విలాసాలకు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేశానని గోప్పలు చెప్పుకుంటు తిరుగుతున్న ధర్మారెడ్డికి బురదమయంగా మారిన రోడ్ల దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఇప్పటికైనా శే్వతప్రతం విడుదల చేసి నిజాయితిని చాటుకోవాలన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేసిన రాజభద్రయ్య పాలన బాగుందన్న ధర్మారెడ్డి చైర్‌పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాలన బాగాలేదని అవిశ్వా సం పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరితే తప్పుకాదా అని ఎద్దేవ చేశారు. కార్యక్రమం లో టీడీపీ పరకాల పట్టణ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, లక్కం ప్రకా శ్, పల్లెబోయిన రాజయ్య, దామెర మండల పార్టీ అధ్యక్షులు చేరాలు, జిల్లా ఉపాధ్యక్షులు తోట రవీందర్, దార్న నారాయణదాసు, సాంబరాజు క్రిష్ణ, రామన్న, రవిందర్, డాక్టర్ రజనీకాంత్, జీవి. అంజనేయులు, రాజేష్, యుగేందర్, బ్రహ్మం, శివ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డీనేటర్‌గా జాటోతు సంతోష్‌నాయక్
నర్సంపేట, జూలై 21: తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర కోఆర్డీనేటర్‌గా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన జాటోతు సంతోష్‌నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర పార్టీ నియామక ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలోని నెక్కొండ మండలం వెంకటాపురం కు చెందిన జాటోతు సంతోషనాయక్ 2008వ సంవత్సరంలో ఇంటర్ చదువుతూ టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. అప్పటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వీరాభిమానిగా మారాడు. టీఎన్‌ఎస్‌ఎఫ్ డివిజన్ అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఎంటెక్ పూర్తి చేసిన సంతోష్‌నాయక్ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారు. ఈసందర్భంగా సంతోష్‌నాయక్ మాట్లాడుతూ రాబోయే రోజులలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి కృషి చేసిన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలకు ఈసందర్భంగా సంతోష్‌నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

నాకే తప్పుడు సమాచారమిస్తావా..!?
* పంచాయతీ కార్యదర్శిపై ఎమ్మెల్యే గుస్సా..
కేసముద్రం, జూలై 21: కోమటిపల్లి గ్రామంలో గుండెపోటుతో దారావత్ బిచ్చానాయక్ అనే వ్యక్తి మృతి చెంద గా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ గ్రామానికి వచ్చారు. పరామ ర్శ తరువాత ఎమ్మెల్యే వద్దకు గ్రామంలోని పలువురు ఆసరా పింఛన్‌దారులు తమకు పింఛన్ ఇవ్వకుండా నిలిపివేశారని, వేలిముద్రలు పడక ఇవ్వడం లేదని, కార్యదర్శి వేలిముద్ర వేయించి ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సదరు పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మరుగుదొడ్లు మంజూరైనా నిర్మించుకోకుండా మిగిలిన వారి కి ఆసరా పింఛన్ నిలిపివేయాలని ఎంపీడీఓ ఆదేశించారని, చెప్పగా మీరెక్కడున్నారని కార్యదర్శిని అడగగా, తాను మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నట్లు సమాధానమివ్వడంతో ఎమ్మెల్యే నేరుగా కోమటిపల్లి నుండి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి సదరు కార్యదర్శి కోసం వాకబు చేయగా అక్కడ ఆయన లేడ ని తెలుసుకొని ఆగ్రహించిన ఎమ్మెల్యే తనకే తప్పుడు సమాచారం ఇచ్చిన కార్యదర్శికి చార్జ్ మెమో ఇవ్వాలని, ఈ విషయం పై జిల్లా కలెక్టర్‌కు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ అరుణాదేవిని ఆదేశించారు. కాగా మండల పరిషత్ సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి ఉద్యోగుల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుండగా, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాచెర్ల రమేష్, మార్కెట్ వైస్ చైర్మెన్ ఓలం చంద్రమోహన్, కో ఆప్షన్ మెంబర్ నజీరహ్మద్, ముత్యాల శివుడు, బట్టు శ్రీను, కొల్లూ రి శ్రీను, రేవంత్, నర్సింగం వెంకటేశ్వర్లు, తొనుపునూరి సాయిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.