వరంగల్

కేసీఆర్ రైతు పక్షపాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 14: దేశంలో ఎక్కడ లేని విధం గా రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ రైతుకు ఎకరాకు రెండు పంటలకుగాను రూ.8 వేలు చొప్పున సాలీ నా 12 వేల కోట్లు రైతు పెట్టుబడి కింద అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ రాష్టమ్రని ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించిన అనంతరం రైతు బీమా పథకం క్రింద రైతులకు బీమా బాండ్లను అందజేయుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐనవోలు మండల కేంద్రం లో132/32 సబ్ స్టేషన్ నిర్మాణం, 2.70కోట్ల రూపాయల వ్యయంతో కస్తూర్భా పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన, రూ.36 లక్షల వ్యయంతో కాకతీయ తోరణంను పునర్‌నిర్మాణం చేసుకున్నామని అన్నారు. సాధ్యం కాని తెలంగాణను సాధించుకు న్న చరిత్రకారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రబాగాన నిలబెట్టాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగా చేయాలని, రైతును రాజు చేయాలనేది సీఎం లక్ష్యం అని అన్నారు. తెలంగాణ రాక ముం దు కరెంట్ లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారని అటువంటది నేడు దేశంలో 24గంటలు ఉచిత కరెం ట్ ఎక్కడైన ఇస్తున్నారని అని ఆయన ప్రశ్నించారు. రైతు మరణిస్తే 5 లక్షలు ఇప్పించే విధంగా రైతు బీమా పథకం ప్రవేశపెట్టామని అన్నారు. రైతు సం క్షేమం కోసం అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిది అని అన్నారు. నేటి నుండి రాష్ట్రంలో అందరికి కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేయబోతున్నామని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండల ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో 46 వేల కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నామని, మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనం చేసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీ దయాకర్ మాట్లాడుతూ 2001లో ఉద్యమ కాలం నుండి తెలంగాణ ఏర్పడితే ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ముందుగానే అలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏం వస్తుందని అన్నవారికి ఒక్కసారి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులన్ని చూడాలని అన్నారు. వరంగల్ మేయర్ నరేందర్ మాట్లాడుతూ రైతు బీమా పథకం కింద రాష్ట్రంలోని 18 సంవత్సరాల నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్క రైతు రైతు బీమాకు అర్హుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమ్రపాలి, జిల్లా చైర్‌పర్సన్ గద్దెల పద్మ, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సీపీ రవీందర్, వర్ధన్నపేట ఎంపీపీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.