వరంగల్

దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 14: దివ్యాంగులకు భరోసా తెలంగా ణ ప్రభుత్వం అని, వారి సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా దివ్యాంగులకు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల సైకిల్‌లతో పాటు పరికరాలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో కడియం మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి దివ్యాంగులకు సహాయం చేయడం కోసం ఆలోచించి కేంద్రానికి ఒక లేఖ రాయడం జరిగిందని అన్నారు. దివ్యాంగునికి పరికరాలు అందించుటకు అవసరమైతే రూ.2 కోట్ల నిధులు కేటాయించి 3 నెలల్లో పరికరా లు అందించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా పరికరాలతో పాటు ఆర్ధిక సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్పొరేషన్ చైర్మన్, సంబంధిత అధికారులను ఆదేశించారు. 80 శాతం సబ్సిడీ ఇస్తూ రుణాలు ఇస్తున్నామని, అవసరమైతే 100 శాతం సబ్సిడీపైన రుణాలు ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సతీరాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సామాజిక న్యాయం, మంత్రిత్వ శాఖ ప్రత్యేక పథకం కింద రూ.2 కోట్ల రూపాయల పరికరాలు అందించడం జరుగుతుందని తెలిపారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ మాట్లాడుతూ ఎంపీ నిధుల నుండి ఏ విధమైన సహాయం చేయడానికైనా సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ద్యివ్యాంగ సహాకార సంస్ధ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహాయంతో 15 లక్షల పరికరాలను జిల్లాలో అందిస్తున్నామని, రాష్ట్రంలో 10 కోట్టు ఆర్ధిక రుణ సహాయం అందించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మాట్లాడతూ జిల్లాలో ప్రతి ఒక్కరికీ ట్రై సైకిల్ ఇస్తున్నామని, రుణాలు ఇప్పించుటకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు అవసరమైన వసతి గృహాలలో వసతి కల్పంచడం జరుగుతుందని, విద్యాంగులక ఎకో పార్కు సిటీలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమావేశంలో జిల్లా దివ్యంగుల శాఖ అధికారి శైలజ, ఆర్‌డివో అంకరెడ్డి, వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని దివ్యంగులు తదితరులు పాల్గొన్నారు.