వరంగల్

త్యాగాలు మనవి.. భోగాలు వాళ్లవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఆగస్టు 17: అనేక ఉద్యమాలలో పాల్గొని బీసీలందరం త్యాగా లు చేస్తే బోగాలు మాత్రం అగ్రకులాలు అనుభవిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. బీసీలను రాజకీయంగా చైతన్యం చేయాలనే ఉద్ధేశ్యంతో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10 రోజుల కిందట పాలమూరులో ప్రారంభమైన రాజకీయ చైతన్య (బస్సు)యాత్ర వివిధ నియోజక వర్గాల మీదుగా శుక్రవారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక బీసీ సంఘాల, విద్యార్థి సంఘాల నాయకులు యాత్రకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం స్థానిక పూర్ణిమగార్డెన్‌లో ఏర్పాటుచేసిన సదస్సుకు బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు పిట్టల సత్యం అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలను ఓటుబ్యాంక్‌గా వాడుకుంటున్నారు తప్పా వాటి సంక్షేమం కోసం శాశ్వత మార్గాన్ని ఆలోచించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నామమత్రంగా ఉన్న అగ్రకులాలు ఆదిపత్యం చలాయిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మిగతా అన్ని సామాజిక వర్గాలను ప్రలోబాలకు గురిచేస్తూ అధికారంలోకి వస్తున్నాయని ఆరోపించారు. మనము ఓట్లు వేస్తేనే వాళ్లు సీట్లలో కూర్చుంటున్నారని గుర్తుచేశారు. అందుకే మన ఓట్లు మనమే వేసుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలంతా ఏకమైతే వారి ఆటలు చెల్లవనే వాస్తవాన్ని గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో జనాభా ప్రాతిపాధికన 60 మంది బీసీ ఎమ్మెల్యేలుకు ప్రస్తుతం 20మంది మాత్రమే ఉన్నారని, 552పార్లమెంట్ సభ్యుల్లో 276 మంది బీసీ ఎంపీలకుగాను 82 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీల్లో 9 మందికి గాను ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచరాములు, కౌన్సిలర్ ఆకుల వేణుగోపాల్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పిట్టల సురేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు విక్రమ్‌గౌడ్, బీసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరు శేఖర్, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు తీగల సిద్దు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గద్దర్ పోటీచేయాలి
* బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి * జైభీమ్, లాల్‌సలామ్‌లు ఏకం కావాలి
* టీమాస్ రాష్ట్ర చైర్మన్ కంచె ఐలయ్య పిలుపు
మహబూబాబాద్, ఆగస్టు 17: ప్రజాగాయకుడు గద్దర్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీచేయాలని ‘టీమాస్’ రాష్ట్ర చైర్మన్ కంచె ఐలయ్య అన్నారు. మానుకోటలోని పెరుమాండ్ల జగన్నాదం భవన్‌లో బహుజనుల రాజ్యాధికారం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. బ్రహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమలు ఇంతకాలం పాటించారని, ఇప్పుడు టీమాస్ సారథ్యంలో బహుజనులే పాలించే రోజులు రావాలన్నారు. భారతదేశం మారాలంటే పాలకవర్గాలు మారాలని అణిచివేతకు గురవుతున్న వర్గాలు రాజ్యాధికారం సాదించాలని ఐలయ్య అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. టీమాస్ అధికారంలోకి వస్తే బహుజన బువ్వక్యాంటీన్ ఏర్పాటు చేస్తామని, రూ.3తో బ్రెక్‌ఫాస్ట్, రూ.5తో లంచ్ అందజేస్తామన్నారు. ఇంటర్ చదివిన వారికి రూ.3లక్షల లోను, డిగ్రీ చదివిన వారికి రూ.5లక్షల లోను ఉపాధి కోసం టీమాస్ అందజేస్తుందని ఐలయ్య అన్నారు. ఇంతకాలం ప్రజలను అణిచివేసిన వర్గాలను అధికారానికి దూరంచేయడం కోసం జైభీమ్, లాల్‌సలామ్‌లు ఏకం కావాలని ఐలయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించుకున్న లక్ష్యం వేరని.. కానీ పాలకులు అవలంభిస్తున్న విధానాలు మరోరకంగా ఉన్నాయన్నారు. వీటన్నింటికి పరిష్కారం పాలకవర్గాల మార్పే అని ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఈసదస్సులో వివిధ ప్రజాకులసంఘాల నాయకులు పిల్లి సుధాకర్, హరినాయక్, గుగ్గీళ్ల పీరయ్య, కుర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని వాజపేయి మృతి దేశానికి తీరని లోటు
* ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు * టీఎన్‌జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం
వరంగల్, ఆగస్టు 17: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి మరణం దేశానికి తీరని లోటని టీఎన్‌జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం వాజ్‌పేయి స్మృత్యర్థం టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో చింతగట్టు క్యాంపులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరైన మాట్లాడారు. వాజపేయి సమోహన నాయకత్వం, అద్భుతమైన వాక్‌చాతుర్యం, శిఖర సమానమైన దేశభక్తి ఆయన సొంతమని అన్నారు. పరిపాలన దక్షుడు, రాజనీతి, విలువలతో కూడిన రాజకీయాలను నడిపి యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ కోల రాజేశ్ కుమార్, కొండలరెడ్డి, రత్నవీరాచారి, రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.