వరంగల్

డెలవరి కోసం వస్తే.. బాబును చంపేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 12: డెలవరి కోసం ఆసుపత్రికి వస్తే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాబు చనిపోయాడని పేర్కొం టూ బాధితులు పరకాలలోని ఓ ప్రైవే ట్ ఆసుపత్రి ఎదుట బుధవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి... పరకాల పట్ట ణ శివారుకు చెందిన సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య డెలవరి కోసం పరకాల పట్టణంలోని ఓ ప్రైవే ట్ ఆసుపత్రికి ఈనెల 6న తీసుక వచ్చినట్లు సంధ్య బంధువులు తెలిపారు. అయితే సంధ్యకు అప్పటికే 9 నెలలు నిండినాయని డాక్టర్‌ను చూపిస్తే చూసి మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల కు వస్తానని చెప్పి వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే సంధ్య అవస్థలు పడుతున్న ఆసుపత్రి నుండి వెళ్లనీయకుండా వస్తున్న అంటూ డాక్టర్ సాయంత్రం వచ్చి సంధ్యను చూసి బాబు ఉమ్మినీరు తాగడం వల్ల చనిపోయనాడని వెంటనే వరంగల్‌కు వెళ్లాలని చెప్పిందని లేని యెడల తల్లికి ప్రమాదం అని తెలిపిందన్నారు. దీంతో తాము వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుక వెళ్లగా వారు డాక్టర్ నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయినట్లు చెప్పారని వారు తెలిపారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యంతో బాబు చనిపోవడమే కాకుండా సంధ్య ప్రాణాల మీదికి తీసుక వచ్చిన డాక్టర్‌ను బుధవారం పరకాలకు వచ్చి నిలదీస్తు ఆందోళన నిర్వహించారు. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన, గొడవలు చేయవద్దని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.