వరంగల్

భయంతోనే ముందస్తు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, సెప్టెంబర్ 12: అభద్రతాభావంతోనే సీఎం కేసీఆర్ ముంద స్తు ఎన్నికలకు వెళ్తున్నాడని భారతీ య జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం డివిజన్‌కేంద్రంలోని విశ్రాంతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్న భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఆందోళన మొదలైందని, టీఆర్‌ఎస్ హయంలో తెలంగాణలో నిజాం తరహా నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఆయన కుమారుడు కేటీఆర్, కూతరు కవిత, అల్లుడు హరీష్‌రావులు కలసి తెలంగాణను ప్రైవేట్ లిమిటిడ్ కంపెనీగా మార్చారని విమర్శించారు. రాష్టవ్య్రాప్తంగా పదవీకాలం ముగిసినా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేసిన రాష్ట్రప్రభుత్వం శాసనసభకు తొమ్మిది నెలలు ముందుగానే ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విషయంలో అసమ్మతి, అసంతృప్తి తీవ్రంగా నెలకొని ఉందన్నారు. రాష్ట్ర శాసన సభకు నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పోటీకి సిద్ధం గా ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీ జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి దొంగలతో నిండిన దొంగలగుంపు అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యమ్నాయం ఒక్క బీజేపీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీన మహబూబ్‌నగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో జరుగనున్న భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన రావాలంటే బీజేపీని ఆదరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను పాలకుర్తి నియోజకవర్గం నుండి పోటీచేస్తానని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య, రాష్టక్రమిటీ సభ్యుడు పెదగాని సోమయ్య, నాయకులు శ్రీమాన్, వెంగళ్‌రావు, పల్లె కుమార్, హనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, రాంమ్మోహన్‌రెడ్డి, గోపి, పులేందర్, వెంకన్న, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.