వరంగల్

రేషన్ డీలర్లకు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 12: ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న రేషన్ డీలర్లకు రాబోయే రోజులలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. కనీస వేతనాల కల సాకారం చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించా రు. నర్సంపేట పట్టణంలోని రెడ్డి కల్యా ణ మండపంలో రూరల్ జిల్లా రేషన్ డీలర్ల కమీషన్‌కు సంబంధించి రూ. 3.12కోట్ల చెక్కులను ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి పెద్ది సుదర్శన్‌రెడ్డి బుధవారం అందజేశారు. ఈసందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడు తూ రేషన్ డీలర్లకు గతంలో కిలోకు 20 పైసల కమీషన్ మాత్రమే ఇచ్చే వార ని, ఈక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర పెద్దలను ఒప్పించి కిలోకు 70 పైసల కమీషన్ పెంచి చెల్లిస్తున్నా రు. ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధి ఉండి పనిచేస్తున్న రేషన్ డీలర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో వారి భవిష్యత్తు గురించి సంఘం ముఖ్య నాయకులతో కలిసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పీడీఎఫ్ బియ్యం గతంలో పక్కదారి పట్టేవని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడా అవకతవకలు చోటు చేసుకోకుండా లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. అదే విధంగా రేషన్ డీలర్లకు పనిగంటలు పెంచి, కనీస వేతనాలు చెల్లించేలా కృషి చేస్తామని, ఇదే సమయంలో నిత్యావసర సరుకులైన నూనె, చక్కెర, పప్పు, ఉప్పు తదితర వస్తువులను రేష న్ షాపులలకు సరఫరా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని అన్నా రు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, డీఎస్‌వో వనజారాణి, డీఎం భాస్కర్‌రావు, ఆర్డీవో రవి, మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌బాబు, రూరల్ జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్ పాల్గొన్నారు.

భద్రాచలంలో గులాబీ జెండా ఎగరాలి
*ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 12: భద్రాచలం నియోజకవర్గం లో గ్రామగ్రామాన కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం నడుం బిగించి భద్రాచ లం నియోజకవర్గంలో గులాబీ జెం డాను ఎగురవేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథిగృహం ఆవరణలో వెంకటాపు రం, వాజేడు మండలాల తెరాస ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో పరిచయ సమావేశాన్ని నిర్వహించా రు. తెరాస అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ సమావేశంలో పాల్గొని నాయకులను పరిచయం చేసుకున్నారు. నియోజకవర్గంలో తాను ప్రతి గ్రామంలో పరిచయమై ఉన్నానని, అయితే పార్టీ కేడర్‌కు తాను కొత్త కాబట్టి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజాప్రతినిధులు ఆయనను పరిచయం చేసుకున్నారు. భద్రాచలం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసిన బోదెబోయిన బుచ్చయ్య, మానె రామకృష్ణ సైతం ఒకే వేదికపై కనిపించారు. వెంకట్రావ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా తెరాస అభ్యర్థి వెంకట్రావ్ కమ్యూనిటీహాల్ నిర్మాణం కో సం రూ.2లక్షలు విరాళాన్ని ప్రకటించారు. శ్రీనివాసరావు, ధనలక్ష్మి, స్వరూప, గంపా రాంబాబు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.