వరంగల్

అమనగల్‌లో కార్డన్‌సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, సెప్టెంబర్ 17: మహబూబాబాద్ జిల్లాలోని అమనగల్ గ్రామంలో ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వందమంది పోలీస్ సిబ్బందితో కలసి ఉదయం 5గంటల నుండి 7.30గంటల వరకు ఈ కార్డన్‌సెర్చ్ జరిగింది. ఈ సందర్భం గా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఏక కాలంలో అమనగల్ గ్రామా న్ని చుట్టుముట్టి గ్రామం లోపల ఉన్న అనుమానాస్పద వ్యక్తుల ఇండ్లను, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలలో అణువణువున గాలింపు చర్య లు చేపట్టడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో 12బీర్ కాటన్స్, రూ.50వేలు విలువ చేసే మద్యం, 220లీటర్ల గుడుంబా, నంబర్‌లేని మోటారు వాహనా లు, అంబర్‌పాకెట్స్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. త్వరలో మనరాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీస్‌శాఖ వివిధ గ్రామాలలో ఉన్న రౌడీలను, గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడ్డవారందరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, ఒక్కొక్కరి నుండి లక్ష పూచికత్తు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాబోవు ఎన్నికలు సజావుగా జరుగుటకు ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టడం జరిగిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
రాష్టస్థ్రాయి వాలీబాల్‌కు విద్యార్థిని ఎంపిక
నర్సింహులపేట, సెప్టెంబర్ 17: నర్సింహులపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సీహెచ్ లావణ్య ఉమ్మడి వరంగల్ జిల్లా జేఎస్‌ఎస్ వాలీబాల్‌కు ఎంపికైనట్లు పాఠశాల పీడీ పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్టస్థ్రాయికి ఎంపికైన లావణ్య మంచిర్యాలలో జరిగే వాలీబాల్ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పాఠశాల ప్రదానోపాద్యాయుడు వెంకట్‌రెడ్డి, కోచ్ వీరారెడ్డి, ఉపాద్యాయులు పాషా, వీరేందర్‌లు లావణ్యను అభినందించారు.