వరంగల్

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని * ఘనంగా జరుపుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 17: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 27వరకు విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అన్నారు. ఈ నెల 23న రామప్ప-లక్నవరం-గణపురం కోటగుళ్లు సందర్శనకు ప్యాకేజీ టూర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులలో వాహన సదుపాయంతో పాటు లంచ్, స్నాక్స్‌లతో కలిపి పెద్దలకు 300 రూపాయలు, పిల్లలకు 250రూపాయలను ప్యాకేజి టూర్ చార్జిగా నిర్ణయించినట్లు తెలిపారు. పాత కలెక్టరేట్ నుండి ఉదయం 7గంటలకు ప్యాకేజి టూర్ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. సాయంత్రం 6గంటలకు తిరిగి హన్మకొండ చేరకోనునట్లు కలెక్టర్ పేర్కోన్నారు. ప్యాకేజి టూర్ బుకింగ్, ఇతర వివరాలకు జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో కాని లేదా 98493-38854,98669-19131లను సంప్రదించాలని కోరారు. అలాగే ఈనెల 25న ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలకు చెందిన 8 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధులకు పర్యాటక రంగం-అభివృద్ధి అనే అంశంపై తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తదనుగుణంగా ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు తగు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా విద్యాశాకాధికారికి సూచించారు. ఈనెల 26న హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి వేయిస్తంభాల దేవాలయం వరకు ఉదయం 7గంటలకు హెరిటేజ్ వాక్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఖిలా వరంగల్ తూర్పు ద్వారం నుండి కుష్‌మహల్ వరకు , రామప్ప దేవాలయం వద్ద కూడా ఉదయం 7గంటలకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేయనునట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలని జిల్లా పర్యాటక శాఖాధికారి శివాజిని ఆదేశించారు