వరంగల్

కారు గుర్తుకు ఓటేసీ మరోసారి ఆశ్వీరదించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, సెప్టెంబర్ 17: కారు గుర్తుకు ఓటేసీ మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించండి.. వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తానని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. టీ ఆర్ ఎస్ చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో ఇంటింటికి అభివృద్ధి.. ఇంటి ముందు అభ్యర్ధి నినాదంతో సోమవారం మండలంలోని అర్పనపల్లి, కాట్రపల్లి, భవానిగడ్డ, ఉప్పరపల్లి, వెంకటగిరి, ఇంటికనె్న, దన్నసరి, సబ్‌స్టేషన్ తండాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాలు, తండాల్లో కాలినడకన ప్రతి ఇంటి తలుపుతట్టి తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించానన్నారు. అన్ని గ్రామాలకు మెరుగైన రోడ్లు వేయించానని, మిషన్ కాకతీయ పథకంలో చెరువులకు మరమ్మత్తు చేయించానన్నారు. సీ ఎం కేసీ ఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల పథకంతో పాటు వందల మంది ఆపన్నులకు సీ ఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి పేదల ఇంట్లో వెలుగులు నింపినట్లు పేర్కొన్నారు. మరోసారి గెలిపిస్తే మానుకోట నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేస్తానన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. కనిపించిన ఒక్కరిని పలకరిస్తూ పర్యటన సాగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ నజీరహ్మద్, దామెరకొండ ప్రవీన్‌కుమార్, ఊకంటి యాకూబ్‌రెడ్డి, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మోడెం రవీందర్‌గౌడ్. రావుల శ్రీనాధ్‌రెడ్డి, అల్లి బీరయ్య, రాణి, సూరయ్య, ఉపేందర్, మహేశ్వరచారి, బట్టు శ్రీను, వెంకన్న, నల్ల కిరణ్, వేం సంపత్‌రెడ్డి, రేవంత్, నాగిరెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అర్పనపల్లిలో అడ్డగింత:
కాగా పల్లెబాట కార్యక్రమంలో భాగంగా అర్పనపల్లిలో పర్యటించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌ను స్వపక్ష పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు అడ్డగించారు. నాలుగేళ్ల కాలంలో గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఒక్కరికి కూడా ఇవ్వలేదని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు, మరే ఇతర అభివృద్ధి పనులు గ్రామంలో ఎవరికి దక్కలేదని ఆరోపించారు. గ్రామంలో ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని, సీఎం కేసీఆర్ ముద్దు.. శంకర్‌నాయక్ వద్దంటూ పెద్ద పెట్టున మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహన కాన్వాయిని అడ్డుకున్నారు. గ్రామంలో ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అలాగే వెంకటగిరి, చెంద్రుతండాల్లో సైతం పల్లెబాట కార్యక్రమానికి నిరసన ఎదురైంది. వెంకటగిరి, చెంద్రుతండా వద్ద రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప వేయగా, టీఆర్‌ఎస్ నాయకులు వచ్చి తొలగించడంతో ఇరు వర్గాల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.