వరంగల్

భద్రతల నడుమ వినాయక మండపాలు * అధునిక టెక్నాలజీతో పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 17: ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీ సాయంతో కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మండపాల భద్రతను పర్యవేక్షించడం జరుగుతోందని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేడు అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలను నియంత్రించంతో పాటు, గంటల వ్యవధిలో నేరస్ధులను గుర్తించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు విజయం సాధిస్తున్నారని తెలిపారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా తోలిసారి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు పూర్తి స్ధాయిలో భద్రత కల్పించడంతో మరో అడుగు ముందుకేసిందని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 4,571 గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయగా, ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 1900, ఈస్ట్‌జోన్ లో 1468, వెస్ట్‌జోన్‌లో 1203 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన విగ్రహల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్ల వారిగా నెలకోల్పబడిన విగ్రహాల సమాచారం సులభంగా గుర్తించేందుగాను పోలీస్‌స్టేషన్లవారిగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తోలి సారి గణపతి విగ్రహాలను జీయో ట్యాగింగ్ ద్వారా గూగుల్ మ్యాప్‌లకు అనుసంధానం చేయడం జరుగుతోందని తెలిపారు. విగ్రహాల వద్దకు బ్లూకోల్ట్స్ లేదా పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది వెళ్లి విగ్రహాలను నెలకోల్పబడిన ప్రదేశం, ఏర్పాటు చేసిన వ్యక్తుల సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వారి సెల్‌ఫోన్ నెంబర్లతో కూడిన పూర్తి సమాచారాన్ని సేకరించిన విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం నుండే పోలీస్ సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న ట్యాబ్‌లో జీయో ట్యాగింగ్ చేయబడుతుంది. ఈ విధంగా జీయో ట్యాగింగ్ చేయడం ద్వారా పోలీస్ స్టేషన్ల వారిగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసిన ప్రదేశాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించడం సులభమవుతుంది. ముఖ్యంగా జీయో ట్యాగింగ్ ద్వారా గుర్తిచబడిన విగ్రహాలకు భద్రత కల్పించడంలో పోలీసులకు మరింత సులభమవుతుందని అన్నారు. ముఖ్యంగా పెట్రోలింగ్ సిబ్బందితో పాటు బ్లూకోల్ట్స్ సిబ్బంది వద్ద వున్న ట్యాబ్‌ల్లో నిక్షిప్తమయిన మంపాల ప్రాంతాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తు విగ్రహాలను భద్రత కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా సేకరించిన సమాచారం భవిష్యత్ రోజుల్లోను వినాయక విగ్రహాలను పూర్తి స్ధాయిలో భద్రత కల్పిండములో వినియోగపడుతుందని వరంగల్ కమిషనర్ పేర్కోన్నారు.