వరంగల్

కాంగ్రెస్ వైఖరితోనే ముందస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కోర్టులకు వెళుతూ అభివృద్ధి నిరోధక పార్టీగా మారిన కాం గ్రెస్ పార్టీ వైఖరిని ప్రజా కోర్టులో తేల్చుకునేందుకే ముం దస్తు ఎన్నికలకు వెళ్లవలసి వచ్చిందని రాష్ట్ర (ఆపద్ధర్మ ప్రభుత్వం) గిరిజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. మంగళవా రం భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో మంత్రి చందులాల్, ఎంపీ సీతారాం నాయక్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్‌లు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ములుగు అభ్యర్థిగా మంత్రి చందులాల్ పేరును ఖరారు చేసిన అనంతరం మొదటిసారిగా మంగపేట మండలానికి విచ్చేసిన మంత్రి చందులాల్‌కు మంగపేట మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. కమలాపురంలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుండి రాజుపేట వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పలు చోట్ల మహిళలు మంత్రి చందులాల్‌కు హరతి పట్టారు. ఈ సందర్భంగా మండలంలోని రాజుపేటలో మంత్రి చందుల్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచి టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని చందులాల్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ సీతారాం నాయక్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్‌లు మాట్లాడుతూ అభివృద్ధి అంటే చందులాల్, చందులాల్ అంటే అభివృద్ధని, ములుగు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మొత్తం మంత్రి చందులాల్ చేసిందేనని అన్నారు. సీఎం దృషికి బిల్ట్ కంపెనీ, కార్మికుల సమస్యలను పలుమార్లు తీసుకెళ్ళడంతో బిల్ట్ పునప్రారంభంకు నోచుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం, ములు గు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోరం సంతోష్, నాయకులు పచ్చా శేషగిరిరావు, దూళిపాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తుతో ప్రజలపై పెను భారం
* కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోనున్న ప్రజలు
* ఉమ్మడి జిల్లాలో లక్ష ఓట్ల గల్లంతు
* భాజపా రూరల్ జిల్లా అధ్యక్షులు అశోక్‌రెడ్డి
నక్కలగుట్ట, సెప్టెంబర్ 18: సీఎం కేసీఆర్ తీసుకున్న ముందస్తు ఎన్నికలతో ప్రజలపై పెను భారం పడనుందని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే ఎన్నికలు జరగాలని, కాని కేసీఆర్ మనోభీష్టం మేరకు ఎన్నికలు నిర్వహించరాదని భారతీయ జనతా పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం భాజపా రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనపై ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దంగా ఉన్నారని, ముందుస్తుతో ప్రజలకు ముందుగా తెరాస పాలనను చరమగీతం పాడే అవకాశం లభించిందని తెలిపారు. అధికార పార్టీ ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల ఓట్లను తొలగించి, ఎన్నికలలో గెలువాలనే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోనే లక్ష ఓట్లను తొలగించారని, తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్దరించి తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. తెరాస నాయకులు అధికారంలో ఉన్నామనే అహంకార పూరిత మాటలు మాట్లాడడం మంచిది కాదని హితువు పలికారు. సర్వేలన్నీ తలక్రిందులయ్యేలా ప్రజల తీర్పు ఉండబోతోందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ విజయచందర్‌రెడ్డి, కొత్త దశరథం, సత్యపాల్‌రెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

రవీందర్‌రావును సస్పెండ్ చేయాలి
* మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు
రాయపర్తి, సెప్టెంబర్ 18: తెరాస పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేస్తూ నా ఓటమికి కారణమైన తెరాస పార్టీ సం యుక్త రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పార్టీని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌రావు అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని తెరాస పార్టీ కార్యకర్తలతో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఓ క్రమశిక్షణ లేని నాయకుడు అని దుయ్యబట్టా రు. నాడు కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేసి నా ఓటమికి కారణం అయిన రవీందర్‌రావు మళ్లీ అదే బాటలో వెళ్లాలని, ఎర్రబెల్లి దయాకర్‌రావును కూడా అదే విధంగా చేయాలని చూస్తున్నారని అన్నారు. దయాకర్‌రావు ఎదురులేని నాయకుడు అని, అభివృద్ధికి మారుపేరు అయిన దయాకర్‌రావును ఎదుర్కోవ డం ఎవరి తరం కాదని అన్నారు. నామినెట్ పోస్టులకు పరిమితం అయిన రవీందర్ రావు ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన మాకు పోలికా అని అన్నారు. పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలు చేపడుతున్న రవీందర్‌రావును తెరాస పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్ విన్నవించనునట్లు ఆయన తెలిపారు. ఉద్య మ కారుల ముసుగులో కొంత మంది అవకాశవాదులను వెంట వెసుకుని పార్టీకి మచ్చ వచ్చేలా ప్రవర్తిస్తా ఉన్నాడని అన్నారు. పాలకుర్తిలో నీవు పోటీ చేస్తే నీ డిపాజిట్ గల్లంతు అవుతుందని ఆయన జోస్యం చేప్పారు. వచ్చే ఎన్నికలలో దయాకర్‌రావును అత్యధిక మేజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనీమిరెడ్డి, నాయకులు సురేందర్‌రావు, నర్సింహానాయక్, ఉండతి సతీష్, కాంచనపల్లి వనజా రాణి, కోటేశ్వర్, కుమార్, నహిం, ఉస్మాన్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.