వరంగల్

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, సెప్టెంబర్ 18: ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోనికి నెట్టిన ఘనత రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం కొమురవెళ్ళి మండలంలోని కిష్టంపేట, రాంసాగర్, గౌరాయపల్లి గ్రామాల్లో జెండా పండుగ సందర్భంగా ప్రజలతో మమేకమై మాట్లాడారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేంతవరకు సోనియాగాంధీ పంచనచేరిన కేసీఆర్ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ను మోసం చేసి గద్దెనెక్కాడని అన్నా రు. ఎన్నికల సమయంలో ఇచ్చిన డబుల్‌బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి లాంటి హామీలను పక్కనపెట్టి న ఘనత ఆయనకే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. అంతకుముందు ప్రముక శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకొని పొన్నాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి రంగరాజు ప్రవీణ్‌కుమార్, నాయకులు వకులాభరణం నర్సయ్యపంతులు, ఉట్లపల్లి శ్రీనివాస్, అడ్వకేట్ శ్రీనివాస్, శ్రీనివాస్, ఐలయ్యగౌడ్, కొమ్ము రవితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

23వ తేదీలోగా ఓటరు జాబితా
వంద శాతం పూర్తి చేయాలి
అధికారులకు వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత ఆదేశం
వరంగల్, సెప్టెంబర్ 18: రానున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగం గా చేపట్టవలిసిన నోటీస్ జనరేషన్ సర్వంగ్, లాజికల్ ఎర్రర్స్, బోగస్ కార్డుల ఏరివేత, చనిపోయిన వారి వివరాలను సంబంధించిన అంశాలన్నింటిని 19వ తేదీ మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యంగా ఓటరు జాబితాకు సంబందిత సాంకేతిక పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు. ఒక వ్యక్తికి ఓటరుగా ఒక టి కంటే ఎక్కువ ప్రాంతాలలో నమోదుయినట్లయితే బూత్ లెవల్ ఆఫీసర్ సం బంధిత వ్యక్తికి సంబంధించిన ఏ ఓటర్ కార్డు తొలగించాలో కోరూతూ నోటీస్ జారీ చేస్తారని తెలిపారు. తహశీల్ధార్ విచారణ తరువాత ఓటరుకు గుర్తింపు కార్డు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఒకరి ఫోటో బదులుగా వేరొకరి ఫోటో ఉండడం, మహిళ స్ధానంలో పురుషుని ఫోటో ఉండటాన్ని గుర్తించాలని కోరారు. బూత్ లెవల్ ఆఫీసర్ స్ధాయిలో గానీ, ఏఇఆర్‌ఓ. ఇఆర్‌ఓ స్ధాయిలో గానీ అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉంచకూడదన్నారు. ఈనెల 23వ తేది వరకు వంద శాంతం ఇఆర్‌ఓ లాగింగ్‌లో నోటీస్ జనరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, డీఆర్‌వో హరిసింగ్, ఆర్‌డీవోలు మహేందర్‌జీ, రవీ, తహశీల్ధార్ పాల్గొన్నారు.

ప్రవేశ పరీక్షల ఫీజులతోనే
ప్రభుత్వం నడుస్తుంది: బీజేవైఎం
వడ్డేపల్లి, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం, చివరకు విద్యార్థుల ప్రవేశ పరీక్షల ఫీజులతోనే నడుస్తుందని భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని భాజపా అర్బన్ పార్టీ కార్యాలయం లో వరంగల్ ఉమ్మడి, ఖమ్మం జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు గుండమీది శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భరత్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అమరులైన విద్యార్థుల ఆశయాలు అడియాశలైనాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు రంజిత్, సాంబయ్య, వంశీచంద్‌రెడ్డి, సునీల్‌రావు, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.