వరంగల్

ఫార్మసీ విద్య అభివృద్ధే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, సెప్టెంబర్ 19: ప్రజలను రోగాల బారినుండి కాపాడి, రోగాలను నియంత్రించడానికే ఔషధరంగ ఆవిర్భావం ఏర్పడిందని, ఫార్మసీ విద్య అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అని, పరిశోధనల ఫలితంగా ఔషధ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని హితోపియాలోని ఉలేగా విశ్వవిద్యాల యం ప్రొఫెసర్ సురేష్ చెన్నుపాటి అన్నారు. బుధవారం బొల్లికుంట వాగ్దేవీ ఫార్మసీ విద్యాసంస్థలు, అసోషియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషినల్స్ సంయుక్తం గా 15వ ఇండో ఆఫ్రికన్ అంతర్జాతీయ ఫార్మసీ సదస్సును నిర్వహించాయి. గ్లోబెల్ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్ అండ్ హెర్బల్ టెక్నాలజీపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా సురేష్ చెన్నుపాటి హాజరై ప్రసంగించారు.
మనిషి పుట్టుకతోనే రోగాలు పుడుతున్నాయని, కాని మనిషి మరణించినా కూడా రోగాలు జీవించే ఉంటున్నాయ ని, రోగాల నియంత్రణ కోసమే ఔషధ రంగం ఆవిర్భవించిందని అన్నారు. నూతన రోగాలు పుట్టుకొచ్చిన కొలదీ ఔషధ రంగంలో పరిశోధనలు విస్తృ తం అవుతున్నాయని పేర్కొన్నారు. పరిశోధనల ఫలితంగానే ఔషధ పారిశ్రామిక రంగం అభివృద్ది చెందుతుందని, అందువలన ఫార్మసీ విద్యకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని వివరించారు. ఫార్మసీ విద్యార్థులు పరిశోధనా దృక్ఫథంతో చదివి ప్రపంచ ఔషధ రంగం లో వస్తున్న విప్లవాత్మక మార్పులు, సాంకేతికతను అవగాహణ పెంచుకోవాలని సూచించారు. ఫార్మసీ రంగంలో ఉన్న విద్యార్థులు సమాజంపై కూడా అవగాహన కలిగి ఉండాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలని ఆయన సూచించారు.రెండు సెషన్స్‌లలో జరిగిన సదస్సులో వివిధ దేశాల నుండి వచ్చిన పార్మసీ అద్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ ప్రొఫెసర్ మధుసూధన్‌రావు, ప్రిన్సిపాల్స్ కమల్ యాదవ్, గురునాథ్, ప్రొఫెసర్ హిమజ, డాక్టర్ రామారావు, డాక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా..
* ఆశీర్వదించండి: గండ్ర సత్యనారాయణ
శాయంపేట, సెప్టెంబర్ 19: రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అందుబాటులో ఉండే తనను ఆశీర్వాదించాలని ఇండిపెండెట్ అభ్యర్ధి గండ్ర సత్యనారాయణ ప్రజలను కోరా రు. మండలంలోని గట్లకానిపర్తి, సూరంపేట, సహారపూర్, శాయంపేట గ్రామాల్లో బుధవారం గండ్ర విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఇటీవల తెరాస అధినేత అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105 మంది అభ్యర్ధులను ప్రకటించడం జరిగిందని భూపాలపల్లి నియోజకవర్గాన్ని మళ్లీ స్పీకర్‌కే కేటాయించడంతో భూపాలపల్లిలో స్వతంత్ర అభ్యర్ధిగి బరిలోకి వస్తున్నానని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన నియోజకవర్గ ప్రజలు గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న తనను ఒక్కసారి గెలిపిస్తే కంటికి రెప్పాలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బాసాని శాంత, రవీ, మారెపల్లి రవీందర్, బాసాని మార్కెండయ, నిమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నేడు టీఆర్‌ఎస్ ప్రాజెక్టుల సందర్శన
నర్సంపేట, సెప్టెంబర్ 19: రామప్ప-పాఖాల, రామప్ప-రంగయ్య చెరువు ప్రాజెక్టులను గురువారం నర్సంపేట మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సందర్శించనున్నారు. రామప్ప చెరువు ప్రాజెక్టుకు 210 కోట్లు మంజూరు అయ్యాయి. నర్సంపేట నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకవచ్చి లక్ష ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో పాఖాల-రామప్ప ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తెలుసుకునే క్రమంలో సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు రైతులు దాదాపు 5 వేల మంది ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు పెద్ది విలేఖరులకు తెలిపారు.