వరంగల్

మీసేవా కేంద్రాలపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 19: ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు, పేర్లు, అడ్రస్సులో తప్పుల సవరణకు, మార్పులకు ప్రభుత్వం నిర్ధేశించిన రుసుముల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న మీసేవా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ హెచ్చరించారు. బుధవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రెడ్‌ఎఫ్‌ఎం-93 ద్వారా నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులను టోల్ ఫ్రీ కాల్ సెంటర్ 1950కు తెలియజేయవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా మీ-సేవా కేంద్రాలు ఫారం-6 ప్రకారం ఓటరు నమోదుకు ఫారం-8 ప్రకారం తప్పులు సవరణకు, ఫారం-8 ఏ ప్రకారం ఒక పోలింగ్ కేంద్రం నుండి మరొక పోలింగ్ కేంద్రమునకు బదిలీ చేసేందుకు ఒక్కొక్కరికి రూ.35 లు చొప్పున వసూల్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందిస్తూ రుసుం పేరుతో అదనంగా వసూలు చేస్తున్న మీ-సేవా కేంద్రాల వివరాలు తనకు తెలియజేయాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ ముందు జాగ్రత్తగా ఇటీవల ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో లేకపోతే ఫారం-6 ప్రకారం బూత్ లెవల్ అధికారికి లేదా తహశీల్ధార్‌కు దరఖాస్తు చేయాలని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా సదురు వెబ్‌సైట్‌లో కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. పౌరునిగా ఓటు వేయడం బాధ్యతగా భావించాలన్నారు. ఓటరుగా నమోదు అయి, ఓటు వేసిన వ్యక్తులకు మాత్రమే వ్యవస్ధను విమర్శించే హక్కు ఉంటుందని తెలిపారు. ఓటరు నమోదులకు ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ముసాయిదా జాబితాను ప్రతి పొలింగ్ కేంద్రం, బూత్ లెవల్ అధికారి, తహశీల్ధార్ వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎన్‌వీఎస్‌పీ.ఇన్‌లో కూడా పరిశీలించుకోవచ్చునని సూచించారు. ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆరు నెలల నుండి నివసిస్తున్న వారు అదే ప్రాంతం పరిధిలో పోలింగ్ కేంద్రంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని మురికివాడలు, ఉన్నత వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలలో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ఎఫ్‌ఎం ఇన్‌చార్జి ఎం హక్, సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులు యాస వెంకటేశ్వర్లు, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.