వరంగల్

రాష్టప్రతి పాలన విధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 19: అపద్దర్మ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని, తక్షణమే తెలంగాణలో రాష్టప్రతి పాలన విధించాలని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంబటి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపేటలోని టీజేఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఆశయాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ పాలన కొనసాగించకుండా చట్టవిరుద్దంగా అప్రజాస్వామికంగా పాలన కొనసాగించిందని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా నిర్భందాలను కొనసాగించారని, ధర్నాచౌక్‌ను ఎత్తివేసి భావ ప్రకటన హక్కు లేకుండా చేశారని వాపోయారు. ధర్నాచౌక్‌ను పునరుద్దరించాలని కోరుతూ హైకోర్టులో రాజకీయ నేత హన్మంతరావు, జన సమి తి నాయకుడు ప్రొఫెసర్ విశే్వశ్వరరావులు పిల్ వేయగా స్వీకరించి కోర్టు రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయకపోతే సుమోటోగా భావించి నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. కేసీఆర్ పౌర హక్కులను కాలరాసారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఆశయాల కోసమే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జన సమితిలు కలిసి తెలంగాణ ప్రజాకూటమి (మహాకూటమి)గా ఏర్పడ్డాయని, ఉమ్మడి కార్యాచరణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో కేసీఆర్‌తో పాటు నర్సంపేటలో పెద్దిని ఓడించడమే జన సమితి లక్ష్యమని వెల్లడించారు. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌కుమార్ హత్యపై రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. గతంలో ప్రణ య్‌ను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించారని ప్రణయ్ భార్య అమృత వర్షిణి చెప్పినా పోలీసులు ఎమ్మెల్యే పాత్ర లేదని వెనుకేసుకరావ డం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యే వీరేశంతో పాటు హైకోర్టు లాయ ర్ సోమభరత్‌కుమార్‌లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీజేఏస్ జిల్లా, మండల నాయకులు బొనగాని రవీందర్, షేక్ జావీద్, భూక్య గోపాల్‌నాయక్, ఎర్రబోయిన రాజశేఖర్, పొలబోయిన లక్ష్మయ్య, యాకాంబ్రం, రాజు, హన్మంతు, రవి, శివ, గుంటి సంజీవ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రణయ్ హత్య నిందితుడిని శిక్షించాలి
జనగామ టౌన్, సెప్టెంబర్ 19: కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను హత్యచేసిన నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని తెలంగాణ జనసమితి జిల్లా కన్వినర్ ఆకుల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రణయ్ హత్యకు నిరసనగా బుధవారం టీజేఎస్, టీజేఎస్ విద్యార్థి, యువజన విభాగం కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి జనగామ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతోనే ప్రణయ్ హత్య జరిగిందని అన్నారు. నిందితులను కాపాడడానికి అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షించని పక్షంలో సమాజం సహించదని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు తిప్పారపు విజయ్‌కుమార్, టీజే ఎస్ నాయకులు సందెన రవీందర్, శ్రీహరి, పిట్టల సురేష్, గన్ను కార్తిక్, అభినయ్, శశాంక్, బోయిని యాకన్న, వినోద్, సందీప్, శ్రీకాంత్, వినయ్, రాకేష్, సాయి, ఈశ్వర్‌లు పాల్గొన్నారు.

చిల్లర మాటలు మానుకోవాలి
* టిక్కెట్ కోసం రాజకీయ డ్రామాలు చేయవద్దు
* సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, సెప్టెంబర్ 19: తనకన్నా వయస్సు పైబడ్డ మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు సిగ్గు, శరం, బఫూన్ అంటూ చిల్లర మాటలు మాట్లాడడం గర్హనీయమని, ఇకనైనా చిల్లర మాటలను మానుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. తాను మాట్లాడగలనని అయితే తాను వారిద్దరికాన్న వయ స్సు చిన్న వాడినని, తన సంస్కారం ఉంది కాబట్టే మాట్లాడదల్చుకోలేదని స్పష్టం చేశారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలవకున్నా నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా మరిన్ని ప్రత్యేక పథకాలను తీసుకవచ్చి మంజూరు చేయిస్తున్నానని చెప్పారు. ఓర్వలేకే ఇద్దరు నాయకులు శూన్య బుద్దితో విమర్శలకు దిగుతున్నారని అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 7 వేల మంది రైతులకు సబ్సిడీ విద్యుత్ మోటార్ల కోసం 9 కోట్ల రూపాయలను తీసుకవచ్చి అమలుకు శ్రీకారం చుడితే దీని పై మాజీ ఎమ్మెల్యేలిద్దరూ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఒకరు, అధికారులను జైలుకు పంపిస్తామని మరొకరు చెప్పడం సిగ్గుచేటన్నారు. సబ్సిడీ విద్యుత్ మోటార్ల పంపిణీ ప్రక్రియను అడ్డుకోవద్దని, అడ్డుకుంటే రైతుల ఉసురు తాకుతుందని అన్నా రు. అభివృద్దికి అడ్డుపడితే ప్రగతి రథ చక్రాల కింద తొక్కేస్తామని హెచ్చరించారు. సబ్సిడీ మోటార్లను అర్హులైన రైతులకే అందించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పడిందన్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఈ సారి ఎన్నికలలో చివరి ఉంటాడో ఉండడో ఆయనను నమ్ముకున్న కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దొంతి, రేవూరిలిద్దరూ టిక్కెట్ కోసం కుస్తీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, దార్ల రమాదేవి, శ్రీనివాస్, ప్రవీణ్, మందుల శ్రీనివాస్, కుమారస్వామి, గంప రాజేశ్వర్, సుదర్శన్ పాల్గొన్నారు.