వరంగల్

ముల్కనూరు బ్యాంక్‌ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమాదేవరపల్లి, సెప్టెంబర్ 20: ముల్కనూరులోని సహకార బ్యాంక్‌ను బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన సహకార ప్రతినిధులు గురువారం ముల్కనూరు సహకార బ్యాంక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ జనరల్ మెనెజర్ మారుపటి రాంరెడ్డి, ఎజీఎం వెంకటేశ్వరరావులు బ్యాంక్ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్యాంక్ పనితీరు వివరించారు. విదేశాల నుండి వచ్చిన వారిలో, కో-ఆపరేటీవ్ సభ్యులు, కో-అపరేటీవ్ చైర్మన్లు, కో- అపరేటీవ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే సబ్బండ వర్గాల అభివృద్ధి
* ఎన్నికల విస్తృత ప్రచారంలో శంకర్‌నాయక్
నెల్లికుదురు, సెప్టెంబర్ 20: పోరాడి సాదించుకున్న తెలంగాణలోని సబ్బండ వర్గాల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి చెందుతాయని తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. ముందస్తు శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలసి మండలంలోని ఆలేరు, నర్సింహులగూడెం, బంజర, మదన్‌తూర్తి, మునిగలవీడు, రావిరాల, నైనాల, నెల్లికుదురు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మిరపచేనులో దంతెపట్టి దున్నారు. పురుగల మందు పిచికారి చేశారు. మదన్‌తూర్తిలో కార్యకర్తలు శంకర్‌నాయక్ తలకు కిరీటం పెట్టారు. విల్లు అందించగా బాణం ఎక్కుపెట్టారు. కార్యకర్తలు, కళాకారులతో కలసి నృత్యం చేశారు. ఆయా గ్రామాల్లో డప్పుచప్పళ్లతో ఘనంగా స్వాగతం పలికారు.

నియోజక స్థానాల్లో ఆదివాసీలను ప్రకటించాలి
* ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్
కొత్తగూడ, సెప్టెంబర్ 20: ఏజెన్సీ ప్రాంతాల నియోజకర్గాల్లో అన్ని రాజకీయ పార్టీలనుంచి ఆదివాసీ అభ్యర్థులను ప్రకటించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.అసెంబ్లీ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలలో ఆదివాసీ అభ్యర్థులను ప్రకటించాలని గురువారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.ఈసందర్భంగా మోకాళ్ళ వెంకన్న మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు స్థానాలు ఏజెన్సీ నియోజక వర్గాలను ప్రకటించడం జరిగిందని అందులో ప్రధానంగా ములుగుని అని రాజకీయ పార్టీలు ఆదివాసి అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం వరకు వలస వచ్చిన లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని అన్నారు.