వరంగల్

ఖరీదైన కార్లలో గుట్కా రవాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, సెప్టెంబర్ 20: ఖరీదైన కార్లలో గుట్కా రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు వ్యాపారస్థులను టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారినుండి 26లక్షల రూపాయల విలువ చేసే 10గుట్కా బ్యాగులు, 10అంబర్ బ్యాగులతోపాటు రెండు కార్లు, ఆటో, ద్విచక్రవాహనం, 9సెల్‌ఫోన్లు, 26వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్స్ ఏసిపి వెంకటరమణారెడ్డి వివరలను వెల్లడించారు. వరంగల్ అర్భన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన వ్యాపారి చిదర హరిశంకర్, ఎల్కతూర్తి మండల కేంద్రానికి చెందిన కురా మహేందర్, బద్రాద్రి కొత్తగూడేం జిల్లాకు చెందిన ధరవాత్ మల్‌సూర్ నాయక్, అక్కెటి సంతోష్, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన దొంతుల రవి, నాత్యం జితేందర్‌లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసకున్నారు. ఆరుగురు వ్యాపారస్తుల్లో ఒకడైన చిదర హరిశంకర్ హసన్‌పర్తిలో ప్రభుత్వం నిషేదించిన గుట్కా, అంబర్ ప్యాకెట్లను అమ్ముతున్నట్లుగా టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ సిఐ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నిఘా ఏర్పాటు చేసారు. హరిశంకర్‌కు కొత్తగూడేంకు చెందిన మల్‌సూర్‌కుమార్, సంతోష్ కారు, ఆటోల ద్వారా గుట్కా బ్యాగులను రవాణా చేసే వారు. ఈ ముగ్గురు వ్యాపారస్థులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిచ్చిన సమాచారంతో మంచిర్యాలకు చెందిన దొంతుల రవి మహరాష్టల్రో పెద్ద మొత్తంలో గుట్కా బ్యాగులను కోనుగోలు చేసి, పోలీసులకు అనుమానం రాకుండా ఖరీదైన కారులో వరంగల్ నగరానికి తరలించేవాడు. నగరానికి చేరుకున్న పిమ్మట గుట్కా బ్యాగులను సంతోష్ ద్వారా శివారు ప్రాంతాల్లో రాత్రిపూట ఆటోల ద్వారా గుట్కా బ్యాగులు కావలిసిన వ్యాపారస్థులకు చేరవేసేవాడు. ఇదే క్రమంలో సదరు గుట్కా వ్యాపారి రవి బుధవారం రాత్రి మహరాష్టన్రుండి 13గుట్కా బ్యాగులు తీసుకువస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఎల్కతూర్తి మండల శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపారి రవి కారును ఆపి తనిఖీ చేయడంతో గుట్కా, అంబర్ బ్యాగులు గుర్తించారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న రవితోపాటు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసకుని విచారించడంతో గుట్కా వ్యాపారం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులపై హసన్‌పర్తి, ఎల్కతూర్తి పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం వారిని సంబంధిత పోలీసులకు అప్పగించారు. పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఏసీపి వెంకటరమణారెడ్డి, సిఐ నందిరాం నాయక్, సిబ్బందిని పోలీసు కమీషనర్ అభినందించారు.

కేయూలో ఎల్‌ఎల్‌బీ పరీక్షలు
* ఆరుగురు విద్యార్థులు బుక్
కేయు క్యాంపస్, సెప్టెంబర్ 20: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో వరంగల్‌లోని యూనివర్సిటీలా కళాశాల, చైతన్య డిగ్రీ కళాశాల, హన్మకొండలో జరుగుతున్న ఎల్‌ఎల్‌బీ (మూడు, ఐదు సంవత్సరాలు) రెండవ సెమిస్టర్, ఎల్‌ఎల్‌ఎం రెండవ సెమిస్టర్ పరీక్షల కేంద్రాలను కంట్రోలర్ ఆఫ్, ఫ్రొఫెసర్ ఎస్ మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రానాధికారి డాక్టర్ సదానందం, డాక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి పరిక్షా తీరుతెన్నులను పరిశీలించారు. వివిధ కేంద్రాలలో ఆరుగురిని మాల్ ప్రాక్టీసెస్ కింద బుక్ చేశారు.